Allu Ent: స్పెషల్ ప్లాన్స్‌తో రంగంలోకి.. ఇది గర్వించదగిన క్షణమంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్
సినీ రంగంతో అల్లు వారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం కొన్ని దశాబ్దాల నాటిది. అల్లు రామలింగయ్య వారసులుగా అల్లు అరవింద్, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో తమ మార్క్ వేసుకున్నారు. బడా నిర్మాతగా సత్తా చాటుతున్న అల్లు అరవింద్ ఆయన వారసులను కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ కొట్టేసి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలవగా.. అల్లు శిరీష్ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉంటే అల్లు అరవింద్ పెద్ద కొడుకు మాత్రం నిర్మాతగా బరిలోకి దిగబోతున్నారు. అల్లు బాబీ అసలు పేరు అల్లు వెంకటేష్. ఆయనకు నటన పట్ల ఆసక్తి లేకపోవడంతో ఎలాగైనా అతన్ని కూడా సినీ రంగంలో సెట్ చేసి మంచి గుర్తింపు వచ్చేలా చేయాలని అల్లు అరవింద్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. నిర్మాతగా ఓ బెస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి తన పెద్ద కుమారుడి చేతిలో పెట్టారు. అదే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'గని'. భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'గని' సెట్స్ వద్ద అన్నయ్య అల్లు బాబీతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు అల్లు అర్జున్. ఇది గర్వించదగిన క్షణం అని పేర్కొంటూ ఫిలిం మేకర్‌గా అన్నయ్య జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకున్నారు. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి స్వాగతం అని పోస్ట్ పెట్టారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి అల్లు బాబీకి పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ చెబుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కాగా అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ మార్క్ కనిపించేలా నిర్మాతగా బాబీ స్పెషల్ ప్లాన్స్‌తో వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.
By July 23, 2021 at 09:12AM
No comments