Breaking News

సినిమా రౌండప్: ప్రియా 'ఇష్క్' అక్కడే.. రేటు పెంచిన ఉప్పెన బ్యూటీ.. రౌడీ క్రేజ్ ఇదీ మరి!


రేటు పెంచిన 'ఉప్పెన' బ్యూటీ తొలి సినిమా 'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకొని తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. దీంతో రెమ్మ్యూనరేషన్ పెంచేసిందట ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాకు 50 లక్షల వరకు తీసుకున్న కృతి.. ఇప్పుడు 75 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట. 'బంగార్రాజు' సినిమా ఆమె 75 లక్షలు తీసుకుంటోందని టాక్. '' అప్‌డేట్ ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 23వ తేదీనే విడుదల చేయాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇక ఇప్పుడు పరిస్థితులు చక్కబడి థియేటర్లు తెరుచుకోకున్న నేపథ్యంలో ఈ నెల 30న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రౌడీ క్రేజ్ అంటే ఇదీ.. కెమెరా ముందుకు వచ్చిరాగానే ప్రేక్షకుల చూపు తనపై పడేలా చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకోవడమే గాక తనదైన మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసి భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రోజురోజుకూ క్రేజ్‌ పెంచుకుంటూ వస్తున్న విజయ్‌.. మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌లో 10 మిలియన్‌ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో తెలుగులో ఈ రేంజ్‌ ఫాలోవర్స్‌ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో ఒకరిగా విజయ్‌ నిలిచాడు. కేవలం ఆ ఒక్కదాని కోసం అరకోటి? మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రాబోతున్న 'మాస్ట్రో' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తుండగా తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ విషయం బయటకొచ్చింది. చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం భారీ రేంజ్ సెట్స్ వేసి ఏకంగా 50 లక్షలు ఖర్చు చేశారట. ఈ పాట సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. అంధుడిగా కమల్‌ హాసన్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విక్రమ్‌’. లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కొంతభాగంలో కమల్ హాసన్ అంధుడిగా కనిపించనున్నారట. కంటిచూపు లేని వ్యక్తిగా విలన్లను చితక్కొట్టబోతున్నారట. ఛాలెంజింగ్‌గా తీసుకొని కమల్ ఈ రోల్ చేస్తున్నారట.


By July 21, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/july-21-movie-roundup-krithi-shetty-vijay-deverakonda-priya-prakash-in-news/articleshow/84604725.cms

No comments