Breaking News

ఈ ప్రపంచంలో ప్రేమను మించిన శక్తి మరేదీ లేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: పూజా హెగ్డే


నటీనటుల్లో చాలామంది స్టార్స్ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటారు. తమ స్థాయిని బట్టి శక్తి, మేర సమాజ సేవ కోసం కృషి చేస్తున్న తారలను చూస్తున్నాం. తాజాగా ఈ లిస్టులో అందాల భామ, యంగ్ హీరోయిన్ చేరింది. ‘ఆల్‌ ఎబౌట్‌ లవ్‌’ అనే ఫౌండేషన్‌ను ప్రారంభించి చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఈ బుట్టబొమ్మ. 'సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి' కదా అంటున్న పూజా హెగ్డే.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంకొకరికి సేవ చేసేంత శక్తి ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని తాను ఎప్పటికీ నమ్ముతానని పేర్కొంది. అందుకే సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో ఈ ‘ఆల్‌ ఎబౌట్‌ లవ్‌’ అనే ఫౌండేషన్‌ ప్రారంభించానని ఆమె తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫౌండేషన్ సాయం చేస్తుందని చెప్పింది. ప్రేమతో చేసే ఏ చిన్న సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణమవుతుందని పూజా చెప్పుకొచ్చింది. సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా 'రాధే శ్యామ్'లో, అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలో నటిస్తున్న పూజా.. చిరంజీవి హీరోగా రాబోతున్న 'ఆచార్య' మూవీలో కూడా భాగమవుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన ఆమె ఆడిపాడుతోంది. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాకు, హిందీలో మరో సినిమాకు సైన్ చేసింది పూజా హెగ్డే.


By July 21, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-started-all-about-love-foundation-to-the-needy/articleshow/84604001.cms

No comments