ట్రయల్ కోర్టులు వలసవాద మనస్తత్వం వీడాలి.. ధనిక పేద తేడాలొద్దు.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
దేశంలో అందరికీ సమానమేనని, ఇందులో ధనికులు, పేదలు అనే తేడా ఉండరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘ధనవంతులు, రాజకీయ అధికారాన్ని వినియోగించేవారు.. న్యాయం పొందడానికి వనరులు, సామర్థ్యం లేని పేదలు ఇలా రెండు సమాంతర వ్యవస్థలు ఉండరాదు... పౌరుల నమ్మకాన్ని కాపాడటంలో జిల్లా న్యాయవ్యవస్థకు ఏర్పడిన వలసవాద మనస్తత్వం మారాలి.. న్యాయంవైపు నిలబడినప్పుడు లక్ష్యం నెరవేరుతుంది’ అని పేర్కొంది. రెండేళ్ల కిందట కాంగ్రెస్ నేత హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే భర్తకు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ‘స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.. ఇది రాజకీయ ఒత్తిళ్లు.. పరిశీలనల నుంచి తప్పించుకోవాలి’అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ద్వంద్వ వ్యవస్థ ఉనికి చట్టం చట్టబద్ధతను దూరం చేస్తుంది.. చట్ట పాలనకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాగాలపై కూడా ఉంది.. న్యాయవ్యవస్థ పౌరుల విశ్వాసాన్ని పరిరక్షించాలంటే జిల్లా న్యాయస్థానాలు దానిపై దృష్టిసారించాలి.. మౌలిక సదుపాయాల కొరత, తగినంత రక్షణలేని భయంకరమైన పరిస్థితుల మధ్య ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పనిచేస్తారు.. న్యాయం కోసం నిలబడినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి’ సుప్రీంకోర్టు తెలిపింది. ‘జిల్లా న్యాయవ్యవస్థకు ఏర్పడిన వలసవాద మనస్తత్వం మారాలి.. అప్పుడే ప్రతి పౌరుడికి స్వేచ్ఛకు రక్షణ ఏర్పడుతుంది.. అన్యాయం జరిగే తమ రక్షణ కోసం మొదటి వరుసలో ఉన్నాయని విశ్వాసం కలుగుతుంది’అని ధర్మాసనం తెలిపింది. స్వతంత్ర సంస్థగా న్యాయవ్యవస్థ పనితీరు అధికారాల విభజన భావనలో పాతుకుపోయిందని వ్యాఖ్యానించింది. ‘న్యాయమూర్తులు ఇతర కారకాలకు ఆటంకం లేని చట్టానికి అనుగుణంగా వివాదాలపై తీర్పు చెప్పగలగాలి.. ఆ కారణంగా న్యాయవ్యవస్థకు, ప్రతి న్యాయమూర్తికి స్వతంత్రత తప్పనిసరి.. జిల్లా న్యాయవ్యవస్థ స్వతంత్రతను మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రత్యేకంగా ప్రస్తావించింది’ అని ధర్మాసనం వివరించింది.
By July 24, 2021 at 07:16AM
No comments