Breaking News

క్లిస్టమైన బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన రోగి!


మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు ఆమె హనుమాన్‌ చాలీసా పారాయణ చేశారు. అంతేకాదు, ఆమె మధ్యలో తప్పు పలికితే ఆపరేషన్‌ చేస్తున్న వైద్యుడొకరు సహకరించడం విశేషం. ‘క్రేనియోటమీ’ విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేసినట్టు ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఆమె మెదడుకు ఎడమ వైపున కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్‌‌లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.. ఓ 24 ఏళ్ల మహిళకు మెదడులో కణిత ఏర్పడిందని, శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించామని అన్నారు. మూడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ ఈ ఆపరేషన్‌‌లో మహిళ మెలకువతోనే ఉందన్నారు. ఆమెకు తలపై మాడు భాగంలోనే అనెస్తీషియా, ఇచ్చి, నొప్పి నివారణ ఔషధం ఇచ్చామన్నారు. శస్త్రచికిత్స విజయవంతమయ్యిందని, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్న ఆమెను శనివారం డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్ దీపక్ తెలిపారు. కాగా, గత 20 ఏళ్లలో ఎయిమ్స్ వైద్యులు క్రేనియోటమీ విధానంలో 500పైగా శస్త్రచికిత్స చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబరు 2018లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రి కూడా ఇదే విధమైన శస్త్రచికిత్సను నిర్వహించింది. అలాగే, గిటార్ వాయిస్తుండగా ఓ వ్యక్తికి బెంగళూరు వైద్యులు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా చేశారు.


By July 24, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-recites-hanuman-chalisa-while-undergoing-brain-tumor-surgery-at-delhi-aiims/articleshow/84697448.cms

No comments