అధికార పార్టీ ఎమ్మెల్యేపై మంత్రి బంధువు దాడి.. వీధికెక్కిన వర్గ విబేధాలు
పంజాబ్‌లో అసమ్మతికి ముగింపు పలికిన కాంగ్రెస్‌కు.. చత్తీస్‌గఢ్‌లో తాజా పరిస్థితులు తలనొప్పిగా పరిణమించాయి. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వాహనంపై మంత్రి బంధువు రాళ్లు విసరడం కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమయ్యింది. శనివారం సాయంత్రం బలరాంపూర్ కాంగ్రెస్ కాన్వాయ్ అంబికాపూర్ గుండా వెళుతోంది. ఈ సమయంలో ఓ యువకుడు వాహానాన్ని ఎమ్మెల్యే కాన్వాయ్ అధిగమించింది. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు ఎస్కార్ట్ వాహనాన్ని అడ్డగించి, అద్దం పగులుగొట్టాడు. భద్రతా సిబ్బందిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడ్ని ఆరోగ్య బంధువు సచిన్ సింగ్ దేవ్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆరోగ్య మంత్రి తనను హత్యచేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేల హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా తప్పు ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని ఆరోగ్య మంత్రిని మీడియా ద్వారా ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ‘నాపై దాడిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. మీరు కావాలంటే నన్ను చంపండి.. సీఎం కావాలని ఆశగా ఉంటే అవ్వండి.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. మంత్రి పదవికి పోటీదారుడ్ని కాదు.. నేను ఆదివాసీ ఎమ్మెల్యేను.. నా ప్రాంతంలో అభివృద్ధి కోసం పోరాడంలో పోటీ ఎక్కడ ఉంది?” ఎమ్మెల్యే ప్రశ్నించారు. అంతేకాదు, ‘నేను భూపేశ్ బఘేల్ లేదా టిఎస్ బాబాకు మద్దతుదారుని కాదు. నేను కాంగ్రెస్ మద్దతుదారుడిని’అని ఆయన అన్నారు. ఇక, మంత్రి టీఎస్ దేవ్ బలరాంపూర్ సంస్థానం వారసుడు కావడంతో ఆయనకు కంచుకోట. దీనిపై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. “రాజులు, మహారాజుల పాలనలో మా పూర్వీకులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు.. తరం మారింది.. మేము అక్షర జ్ఞానం సంపాదించాం.. మా హక్కులు మాకు తెలుసు. మేం మా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తప్పా? మీరు మమ్మల్ని కొడతారా?’ అని నిలదీశాడు. ‘భూపేష్ బఘేలా వెంటే ఉన్నాం.. ఎందుకంటే అయన మంచి పనులు చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యేల సమావేశానికి హాజరై కాంగ్రెస్, ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేలా వ్యహరిస్తున్న మంత్రులను తొలగించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పునియాను కోరాం’ అన్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి టీఎస్ దేవ్.. ఇది పార్టీ అంతర్గత విషయని, ఎమ్మెల్యే వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవని అన్నారు. శాసనసభ్యుల సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన అన్నారు.
By July 26, 2021 at 12:13PM
No comments