Breaking News

మరో వివాదస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వర్మ.. ఈసారి భార్యలపై పడ్డాడు ఏంటో


ఒకప్పుడు అంటే సూపర్‌హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ‘శివ’, ‘సర్కార్‌’, ‘సత్య’ వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్‌జీవి.. ‘భూత్’, ‘కౌన్’, ‘ఫూంక్’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అదేస్థాయిలో భయపెట్టాడు. అయితే గతకొంత కాలంగా ఆయన తన విధానాన్ని మార్చుకున్నాడు. తన సినిమాల్లో కథ కంటే కాంట్రవర్సీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే మొదటి నుంచి కూడా వర్మ అంటే కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనే పేరే ఉంది. కానీ, ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీనే తన సక్సెస్ మంత్రగా వర్మ మార్చుకున్నారు. తాజాగా లాక్‌డౌన్ సమయంలో ‘నేక్‌డ్’, ‘నేక్‌డ్-2’, ‘క్లైమాక్స్’ వంటి సినిమాలతో అభిమానులకు షాక్ ఇచ్చారు వర్మ. అంతేకాదు.. ఆయన ప్రకటించే సినిమాలు కూడా ఏదో విధంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. తాజాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించిన ‘30 వెడ్స్ 21’ అనే వెబ్‌సిరీస్‌లో హీరోగా నటించిన కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ ఓ ప్రమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు. ‘త్వరలో అనే వెబ్‌సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. భార్య రావడం మూలంగా ఓ మనిషి జీవితం ఎలా మారిపోతుందో అని ఈ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పెళ్లి చేసుకోవడానికి ముందు కచ్చితంగా ఈ సిరీస్‌ని చూడాలి. భార్యలు వచ్చిన తర్వాత మగవాడి జీవితం ఎలా మారిపోతుందో ఈ సిరీస్ ద్వారా మీ అందరికీ తెలుస్తుంది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అన్ని అయిపోయాయి.. ఇక వర్మ భార్య గురించి సినిమాలు తీస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


By July 25, 2021 at 02:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-to-produce-a-series-on-wives/articleshow/84727285.cms

No comments