అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి.. అడ్డంగా దొరికేయడంతో అది కోసేశారు.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రేమించిన అమ్మాయి ఇంటికి వచ్చిన యువకుడి మర్మాంగాలను కోసి అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపురా రామ్‌పురుష గ్రామానికి చెందిన సౌరభ్ కుమార్ (17) పక్కనే ఉన్న సోర్బారా అనే గ్రామంలో అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి కూడా సౌరభ్‌ను ఇష్టపడింది. ఇంట్లో ఎవరూ లేరని ప్రియురాలు చెప్పడంతో సౌరభ్ శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లాడు. అయితే, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు వచ్చేశారు. తమ కుమార్తెతో సౌరభ్‌ను చూసిన కోపోద్రేకులయ్యారు. వారి నుంచి పారిపోతున్న సౌరభ్‌ను వెంటాడి పట్టుకుని చితకబాదారు. వదిలేయమని అతడు ప్రాధేయపడినా జాలి చూపకుండా సౌరభ్ మర్మాంగాలను కోసేశారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సౌరభ్‌ను స్థానికులు హాస్పిటల్‌లో చేర్పించిన అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి సౌరభ్ కుమార్ మృతిచెందాడు. సౌరభ్‌ను కొట్టి చంపిన వారిలో సుశాంత్ పాండే అనే వ్యక్తిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడి ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంటి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, సౌరభ్ బంధువులు అమ్మాయి ఇంటి ముందే అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. సౌరభ్ హత్యకేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు, మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. మరికొందరు నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. ఈ కేసులో సుశాంత్ పాండే అలియాస్ విజయ్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అయితే, పాండే ఇంటిపై దాడిచేసినవారిలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అశోక్ ఠాకూర్, రంజిత్ కుమార్, ముకేశ్ కుమార్‌గా గుర్తించారు. హత్యోదంతంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తుగానే పోలీసులతో పహారా కాస్తున్నట్టు అధికారులు తెలిపారు. మృతుల బంధువులకు సత్వర చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
By July 25, 2021 at 02:11PM
No comments