Breaking News

కొందరే అలా చేస్తారు.. నయనతారను లాగేసింది.. వనిత విజయ్ కుమార్ కామెంట్స్


కోలీవుడ్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎఫ్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వనిత.. ఇప్పుడు తన కొత్త సినిమా అప్డేట్లతో వైరల్ అవుతోంది. వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తున్న వనిత ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వనిత పబ్లిసిటీ స్టంట్ వేశారు. తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా ఓ పోస్టర్‌ను వదిలారు. అయితే ముందుగా అందరూ అది వనిత నాల్గో పెళ్లి అని భ్రమ పడ్డారు. అయితే మొత్తానికి ఆ చిక్కు ముడి విడిపోయింది. శ్రీనివాసన్, వనిత కలిసి పికప్ డ్రాప్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే అలా పెళ్లి జరిగినట్టుగా ఫోటోలను వదిలారు. అవి సినిమాలోని స్టిల్స్ అని ఆ తరువాత చెప్పేశారు. అయితే ఈ మధ్య బుల్లితెరపై బీబీ జోడిగల్ షోలో వనిత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. రమ్యకృష్ణ జడ్జ్‌గా ఉన్నా కూడా ఆమె నిర్ణయాన్ని ధిక్కరించి ఆ షో నుంచి తప్పుకున్నారు. అలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండే వనితకు ఇలా ఆఫర్లు ఎలా వచ్చాయి? ఎలా ఆమెకు చాన్స్ ఇచ్చారంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. వాటికి వనిత సమాధానం ఇచ్చారు. తమిళ ఇండస్ట్రీలోని ఉన్న పాలిటిక్స్, కాంట్రవర్సీల నడుమ ఆయన నన్ను సహనటిగా ఎంచుకోవడం మామూలు విషయం కాదు. కాంట్రవర్సీల దూరంగా ఉండే తమిళ నటీనటులకు కూడా కొంత మంది అవకాశాలు ఇవ్వరు. నటీమణులకు పిల్లలు ఉన్నా.. ఆమెకు మనవళ్లు మనవరాళ్లు ఉన్నా కూడా హీరోయిన్లు మాత్రం యంగ్‌గానే కనిపించాలి. కానీ కొంత మంది మాత్రమే టాలెంట్‌కు రెస్పెక్ట్ ఇస్తారు. ఏ వయసులో ఉన్నా కూడా అందానికి గౌరవమిస్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడి లోకల్ తమిళ నటీనటులు రెస్పెక్ట్ ఇస్తారు. ఒక వేళ గనుక యోగిబాబు పక్కన నటించేందుకు అంగీకరించకపోతే కొలమావు కోకిల అనే సినిమా వచ్చేది కాదు. అయినా కూడా కథను,కథనాన్ని నమ్మి.. ఆ పాత్రకు ఎవరైతే ప్రాణం పోస్తారో వారిని తీసుకోండి. పవర్ స్టార్ శ్రీనివాసన్ ఆయనంతట ఆయన ఎదిగిన స్టార్ అని వనిత చెప్పుకొచ్చారు.


By July 25, 2021 at 02:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vanitha-vijay-kumar-about-nayanthara-kolamavu-kokila/articleshow/84727164.cms

No comments