Breaking News

బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ.. ‘చోర్ బజార్’ అంటూ ఫస్ట్‌లుక్ రిలీజ్


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘’. హీరోయిన్‌గా గెహన సిప్పీ నటిస్తోంది. ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ చిత్రంలో ,గెహన సిప్పీ లతో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను వదిలింది.టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బైక్ పక్కన నిలబడి ఉన్నాడు. చేతిమీద ‘బచ్చన్ సాబ్’ పేరుతో టాటు కనిపిస్తుంది. మరో చేయితో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. చోర్ బజార్‌లో ఉండే సామను అంతా ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తుంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్‌లో శరవేగంగా జరుగుతుంది. తన సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్‌పై ఆకాష్ పూరి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘చోర్ బజార్ కా షాన్ బచ్చన్ సాబ్’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి కచ్చితంగా ఆకాష్ సినిమా హిట్ అవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అతను స్టార్ హీరోగా మారిపోతాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.


By July 25, 2021 at 12:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akash-puri-new-movie-chor-bazar-first-look-released/articleshow/84725737.cms

No comments