Breaking News

‘లూసిఫర్’ సినిమా గురించి మరో అప్‌డేట్.. ఆ రోల్ కోసం స్టార్ హీరోయిన్


మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘’ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. పృథ్వీరాజ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తర్వాత చిరంజీవి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ తెలుగు రీమేక్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా హీరోయిన్‌ గురించి చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, దేని గురించి కూడా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి సినిమాలో హీరోయిన్ గురించి వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఒరిజినల్ వర్షన్‌లో హీరోయిన్ పాత్ర ఉండదు. అయితే కాని తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప సినిమా ఎక్కదు. అందుకే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా.. టాలీవుడ్ పరిస్థితులకు అనుకూలంగా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లూసిఫర్‌ను మార్చి హీరోయిన్ పాత్రను జొప్పించడం జరుగుతుందట. ఈ ఏడాది పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రను పెట్టారు. ఒరిజినల్‌లో లేకపోయినా.. ప్రేక్షకులను అలరించేందుకు ఓ పాత్రను సృష్టించారు. అలాగే తెలుగులో లూసీఫర్ రీమేక్‌లో కూడా అలాగే హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారని సమాచారం. ఆ పాత్ర కోసం కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతారని తీసుకోవాలని అనుకుంటున్నారట. గతంలో చిరంజీవి, కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. ఇందులోనూ ఆమె చేసిన పాత్ర చిన్నదే అయినప్పటికీ.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో కూడా నయనతార పాత్ర అలాగే ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తోంది.


By July 25, 2021 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nayanatara-to-act-in-the-remake-on-lucifer/articleshow/84724938.cms

No comments