పూస గుచ్చినట్టు వివరించిన బ్యూటీ.. డైరీ అంటూ మొత్తం లీక్ చేసిన రష్మిక
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు పరితపిస్తుంటారు. అలా రష్మిక మందన్నా చేసే పోస్ట్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక రష్మిక మధ్య మధ్యలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేందుకు లైవ్‌లోకి వస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెడుతుంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు రష్మిక ఓపిగ్గా సమాధానాలు చెబుతుంటారు. తాజాగా రష్మిక పెట్టిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ చెప్పడం, పర్సనల్ పిక్ షేర్ చేయడంతో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా రష్మిక తన డైలీ రొటీన్ వర్క్స్ గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా కొందరు డైరీ రాస్తుంటారు. అలా తన డైరీ గురించి రష్మిక చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఓ ఓ నా డైరీని మరిచిపోయాను.. నా ఆరా నన్ను డిస్టర్బ్ చేయడంతో నిద్ర లేచాను. షూటింగ్ లేదు కాబట్టి కాసేపు టీవీ చూశాను.. ఊరికే ఉదయాన్నే లేచాను. ఆరాకు ఇవ్వాల్సిన ఆహారం, మందులు ఇచ్చాను. నా టీం వచ్చింది.. వారితో కాసేపు ముచ్చట్లు పెట్టాను. ఇక ఫోన్ ద్వారానే రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ తరువాత మీటింగ్ కోసం రెడీ అయ్యాను. మీటింగ్ చాలా బాగా జరిగింది. అక్కడి వారంత మంచివారు. ఇక ఓ యాడ్ ఫిల్మ్‌కు డబ్బింగ్ చెప్పాను. రాత్రి ఎనిమిది గంటలకు రిటర్న్ వచ్చేశాను. అన్నం తిన్నాను.. మళ్లీ ఆరాకు ఫుడ్, మెడిసిన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఇద్దరం పడుకున్నాం. అలా రోజు మొత్తం గడిచిపోయింద’ని రష్మిక చెప్పుకొచ్చారు.
By July 03, 2021 at 10:51AM
No comments