అవికా గోర్ పాప్ కార్న్.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో చిన్నారి పెళ్లి కూతురు
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో కెమెరా ముందుకొచ్చి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది . తన సొంత పేరు కంటే ఎక్కువగా చిన్నారి పెళ్లి కూతురు అంటేనే అంతా గుర్తుపట్టే రేంజ్‌లో ఫేమస్ అయింది. ఇక ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ''సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికిపోతావు చిన్నాదాన, రాజు గారి గది 3'' చిత్రాల్లో నటించి కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఓకే చేస్తూ ఏకంగా ఆరు సినిమాలకు కమిటైంది అవికా. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న ఆమె, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ జోడీగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది ఈ చిన్నారి పెళ్లి కూతురు. ఇకపోతే ఆది సాయి కుమార్ సరసన అవికా నటిస్తోన్న ‘అమరన్’ మూవీ ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు యువ నటులు నవీన్ చంద్ర, వెన్నెల రామారావులతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది అవికా. ఇదిలా ఉంటే '' అనే సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారడం విశేషం. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి రోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్నారు. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథను ఆసక్తికరంగా మీ ముందుకు తెస్తున్నామని దర్శకుడు తెలిపాడు.
By July 01, 2021 at 07:47AM
No comments