Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ.. అప్పటిదాకా ఆగాల్సిందే అంటూ బాంబ్ పేల్చిన బాలయ్య బాబు
నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు . కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఇప్పటికే 100కి పైగా సినిమాలు చేసి నేటికీ అదే హవా నడిపిస్తున్న ఆయన.. ఇక తన కొడుకు మోక్షజ్ఞను కూడా రంగంలోకి దించబోతున్నారు. నిజానికి సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు నడుస్తుండగా ఇటీవలే ఆయన సినీ ఎంట్రీ ఉంటుందని కన్ఫమ్ చేశారు బాలయ్య బాబు. అది కూడా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. టాలీవుడ్ చరిత్రలో ఓ చెరిగిపోని, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'ఆదిత్య 369'. అలాంటి సినిమాకు సీక్వెల్ రానుందని, పైగా దీంతో ఉంటుందని తెలిసి నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి వారసుడి ఎంట్రీ విషయంలో మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మోక్షజ్ఞను తెర మీద చూడాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ కూడా ఉండనుండటం విశేషం. తన తండ్రి ఎన్టీఆర్ 'తాతమ్మకల' అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అలాంటి మెళుకువలు నేర్పిస్తానని గతంలోనే బాలకృష్ణ తెలిపారు. ఏదేమైనా గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి.. నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులను మరో రెండేళ్లు వాయిదా వేశారు బాలయ్య.
By July 19, 2021 at 07:40AM
No comments