Varun Tej : ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు.. చిన్నప్పటి నుంచి అంతేనట!
మెగా హీరోలంతా చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారు. రామ్ చరణ్, , , వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అందరూ కూడా ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, పెరగటం వల్ల ఈ కజిన్స్ మధ్య మరింత అనుబంధం ఏర్పడింది. అయితే చిన్నతనం నుంచి ఒకే చోట పెరగడంతో నిహారికను మరదల్లా కాకుండా సిస్టర్‌లానే చూసేవాళ్లమని సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్‌లు ఆ మధ్య కొన్ని ఇంటర్వ్వూల్లో చెప్పుకొచ్చారు. అలా మెగా హీరోలంతా ఎంతో సఖ్యతతో ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఒకరి మీద మరొకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు సోషల మీడియాలో వేసుకునే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. బావా అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తాజాగా సాయి ధరమ్ తేజ అసలు గుట్టు విప్పేశారు. పిల్లలంతా ఒకే చోటకు చేరితో పడుకునేటప్పుడు ఎంత గొడవ చేస్తారో అందరికీ తెలిసిందే. నేను పడుకుంటాను అంటే నేను పడుకుంటాను అని ప్లేస్ కోసం కొట్లాడుతుంటారు. అలా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురు కలిసి ఒకే బెడ్ మీద ప్రశాంతంగా పడుకునేవారట. ఇప్పటికీ అలానే పడుకుంటున్నామని సాయి ధరమ్ తేజ్ ఓ ఫోటో షేర్ చేశారు. అందులో వైష్ణవ్ తేజ్ అర్దనగ్నంగా పడుకున్నట్టు కనిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ దొంగచూపులు చూస్తున్నారు. కొన్ని ఎప్పటికీ మారవు అని సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By June 27, 2021 at 03:38PM
No comments