క్రికెటర్‌తో ఏడడుగులు వేసిన శంకర్ కూతురు.. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం! ఫొటోస్ వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోదరన్‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆ పెళ్లి వేడుక కూడా జరిగిపోయింది. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా అనుకున్నట్లుగానే తమిళనాడులోని మహాబలిపురంలో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం జరిగింది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆమె ఏడడుగులు నడిచింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పెళ్లి మహోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్ దామోదరన్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన తండ్రి తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్‌కు యజమాని కూడా ఆయనే. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక తాలూకు పిక్స్ వైరల్‌గా మారాయి. శంకర్ కూతురు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. అయితే ఉన్నట్టుండి డైరెక్టర్ శంకర్ ఇలా తన కూతురు పెళ్లి తంతు ఫినిష్ చేయడం హాట్ టాపిక్ అయింది. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
By June 27, 2021 at 02:49PM
No comments