ఆ నలుగురే కాదు.. ఇంకొకరు! 'మా' ఎలక్షన్స్ బరిలో మరో నటుడు.. అది కూడా అలా!!
ఎలక్షన్స్ రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా సినీ వర్గాల్లో వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్‌ని ప్రకటించారు. అయితే ఆయనకు మెగా హీరోల మద్దతు లభిస్తోందని తెలుస్తుండగా.. మరో పోటీదారు మంచు విష్ణుకు నరేష్ మద్దతు లభించనుందని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరికి తోడు మరోవైపు జీవిత రాజశేఖర్, హేమ బరిలో నిలవడంతో ఈ పోటీపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న నలుగురు ఎవరికి వారు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా మరో నటుడు ఈ పోటీలో నిలుస్తున్నారనే విషయం బయటకొచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. 'మా' ఎలక్షన్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన తెలిపారు. తన ప్యానల్ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. Also Read: ఇప్పటిదాకా 'మా' ఎన్నికల్లో నలుగురు పోటీ దారులు అని తెలియడమే పెద్ద ఇష్యూ కాగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో నటుడు కూడా నిలవడం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల్లో ఎక్కడ చూసిన 'మా' ఎలక్షన్స్ గురించిన టాపిక్ మాత్రమే నడుస్తోంది. సో.. ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.
By June 27, 2021 at 03:46PM
No comments