Breaking News

Vaccine మాస్ వ్యాక్సినేషన్‌‌తో వేరియంట్స్ ముప్పు.. Modiకి నిపుణులు కీలక సూచనలు


విచక్షణారహిత, అసంపూర్ణ టీకాలు కరోనా ఉత్పరివర్తనాలు ఆవిర్భావానికి కారణమవుతాయని వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. అంతేకాదు, కరోనా సోకినవారికి టీకాలు వేయవలసిన అవసరం లేదని సిఫారసు చేసింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఐఏఈ)కి చెందిన వైద్య నిపుణులు ఈ మేరకు ఓ నివేదికను ప్రధాని మోదీకి అందజేసింది. ఈ బృందంలో ఎయిమ్స్, నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లోని నిపుణులు సైతం ఉన్నారు. పిల్లలు, సామూహిక జనాభాకు బదులు హాని, ప్రమాదంలో ఉన్నవారికి టీకాలు వేయడం ప్రస్తుతం లక్ష్యంగా ఉండాలని సూచించారు. ‘‘దేశంలో మహమ్మారి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ దశలో అన్ని వయసుల వారికి టీకాలు కంటే వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యతకు లాజిస్టిక్స్, ఎపిడెమియోలాజికల్ డేటా ద్వారా మార్గనిర్దేశం చేయాలని కోరుతుంది.. అన్ని వర్గాల వారికి ఒకేసారి టీకా ప్రారంభించడం వల్ల మానవ, ఇతర వనరులు హరించబడతాయి.. ఇది జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నారు. యువత, పిల్లలకు టీకాలు వేయాలనడానికి ఎటువంటి ఆధారాల్లేవు.. ఇది ప్రభావంతం కూడా కాదు.. ప్రణాళికారహిత వ్యాక్సినేషన్ వైరస్ మ్యుటేషన్లను ప్రోత్సహిస్తుందని వివరించారు. ‘విచక్షణారహిత, అసంపూర్ణ టీకాలు మ్యుటేషన్‌‌లు ఆవిర్భవించి.. దేశంలోని అన్ని ప్రాంతాలకు వైరస్ వేగంగా వ్యాప్తిచెందడానికి కారణమవుతాయి.. యువతకు సామూహిక టీకాలు వేయడం యువ జనాభాలో సహజ సంక్రమణ వేగాన్ని నియంత్రించలేదు’ అని తెలిపారు. ‘అలాగే, కరోనా బారినపడి కోలుకున్నవారికి వ్యాక్సిన్ అవసరం లేదు.. సహజ ఇన్ఫెక్షన్ తర్వాత టీకా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రీయ ఆధారాలు లభించిన తరువాత వీరికి టీకాలు వేయవచ్చు’ అని సిఫార్సు చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేరియంట్స్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు లేదా జనాభాను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఉదాహరణకు, డెల్టా వేరియంట్ కారణంగా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాలో కోవిషీల్డ్ రెండో డోస్ తర్వాత తీవ్రత తగ్గింది ‘టీకా అనేది కొవిడ్-19కు వ్యతిరేకంగా ఒక బలమైన, శక్తివంతమైన ఆయుధం..అన్ని బలమైన ఆయుధాల మాదిరిగా దీనిని నిలిపివేయడం లేదా విచక్షణారహితంగా వినియోగించడం పనికిరాదు.. అయితే ఖర్చుతో కూడుకున్న మార్గంలో గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి వ్యూహాత్మకంగా ఉపయోగించాలి’ అని చెప్పారు. ‘దేశంలోని యువ జనాభాకు టీకాలు వేయడం సరైనందే అయినప్పటికీ.. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోవాలి.. మహమ్మారి తీవ్రత దేశంలో కొనసాగుతుండగా వ్యాక్సిన్లు లభ్యత పరిమితంగా ఉంది’ నివేదిక తెలిపింది.


By June 11, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/unplanned-vaccination-can-promote-mutant-strains-health-expert-panel-warns/articleshow/83421732.cms

No comments