Breaking News

బన్నీ ప్లానింగ్ మామూలుగా లేదు.. వరుసగా ఐదు ప్రాజెక్ట్‌లు.. డైరెక్టర్స్ ఎవరంటే?


టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ అయిపోయారు. సినిమాతో బన్నీ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోబోతోన్నారు. అంతా సవ్యంగా ఉండుంటే.. ఈపాటికే పుష్ప అప్డేట్లతో సోషల్ మీడియా అంతా హల్చల్ అయ్యేది. సెకండ్ వేవ్ రాకతో పుష్ప షూటింగ్ వాయిదా పడింది. మధ్యలో బన్నీ కూడా కరోనా బారిన పడ్డారు. అలా పుష్ప సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? లేదా? అనే అనుమానం కూడా ఇప్పుడు మొదలైంది. అలాంటి ఈ తరుణంలో బన్నీకి సంబంధించిన భవిష్యత్ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బన్నీ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తరువాత బన్నీ ఐకాన్ సినిమా మీద దృష్టి పెట్టబోతోన్నట్టు తెలుస్తోందది. అయితే బన్నీ కొరటాల ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. ఇందులో మామూలుగా అయితే ఐకాన్ ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. కొరటాల ప్రాజెక్ట్ ఈ మధ్యే ప్రకటించారు. అలా ఇవి రెండూ కాకుండా బన్నీ ఇప్పుడు మరో మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టేశారు. పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని, అందులో మొదటి పార్ట్ పూర్తయ్యాక ఐకాన్ మీద దృష్టి పెడతారని తెలుస్తోంది. ఆ తరువాత మళ్లీ పుష్ప పార్ట్ 2ను తెరకెక్కిస్తారని టాక్. ఆ తరువాత మురుగుదాస్, బోయపాటి శ్రీను, ఇలా వరుసగా దర్శకులతో బన్నీ సినిమాలు చేయబోతోన్నారని బన్నీ వాసు తెలిపారు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్‌తోనూ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే వీటికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.


By June 11, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-future-five-projects-after-pushpa/articleshow/83422245.cms

No comments