Breaking News

ఏం లేకపోయినా అదొక్కటి ఉంటే చాలు.. సింగర్ మంగ్లీ గుట్టువిప్పిన జోర్దార్ సుజాత


సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వార్తలు చదివే సుజాత.. ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల వచ్చిన ఇమేజ్‌ను సోషల్ మీడియా ద్వారా పెంచుకుంటూ పోతోన్నారు. బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా జోర్దార్ సుజాతకు మంచి పేరు వచ్చింది. షోలో ఉన్నంత కాలం పుటేజ్ కూడా బాగానే వచ్చింది. ఆమె నవ్వులు ఫేక్ అని, అభిజిత్‌తో రిలేషన్ అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అభిజిత్ తనకు అన్న లాంటి వాడని, అన్నా అనే పిలుస్తాను అని బయటకు వచ్చిన తరువాత సుజాత చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తాను బిగ్ బాస్ ఇంట్లో అలానే పిలిచేదాన్ని అని కానీ అది మాత్రం బయటకు చూపించలేదని సుజాత చెప్పుకొచ్చారు. అలా సుజాత కొన్ని రోజులు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. బయటకు వచ్చిన సుజాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలానే కామెడీ స్టార్స్ షోలోనూ సుజాత తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నారు. అవినాష్‌తో వేసే స్కిట్లు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. తన ఉద్యోగం, ఇలా స్పెషల్ షోలతో సుజాత ఫుల్ బిజీగా ఉంటున్నారు. మధ్య మధ్యలో సుజాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. సింగర్ మంగ్లీతో సుజాత ఎక్కువ క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరంతా బయటకు వెళ్లినట్టున్నారు.ఇక మామూలుగానే అమ్మాయిలకు పానీ పూరి అంటే ఎంతప్రీతో అందరికీ తెలిసిందే. అలాగే మంగ్లీకి సైతం పానీ పూరి అంటే ఇష్టమట. ఏది ఉన్నా లేకపోయినా అక్కకు పానీ పూరీ ఉంటే చాలు అని గురించి సుజాత చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆమె షేర్ చేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.


By June 11, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jordar-sujatha-about-singer-mangli-favourite-food-item/articleshow/83421192.cms

No comments