Breaking News

US Gold Coin రికార్డుస్థాయిలో అమ్ముడైన గోల్డ్ కాయిన్.. దీని ధరెంతో తెలిస్తే షాక్!


అమెరికాలో ఓ బంగారు నాణెం వేలంలో రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయింది. మంగళవారం న్యూయార్క్ నగరంలో జరిగిన సోథేబై వేలంలో 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణేన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.142 కోట్లు. ఇదే వేలంలో ప్రపంచంలోనే అరుదైన ఓ స్టాంప్ కూడా 8.3 డాలర్లకు (దాదాపు 61 కోట్లు) అమ్ముడుకావడం విశేషం. డబుల్ ఈగిల్ బంగారు నాణెం 10 నుంచి 15 మిలియన్ల డాలర్లకు అమ్ముడవుతుందని అంచనా వేశారు. కానీ, వేలం నిర్వాహకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఏకంగా 19 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ నాణేన్ని షూ డిజైనర్, పురాతన వస్తువులను సేకరించే స్టువార్ట్ వెయిట్జ్‌మన్ అనే వ్యక్తి అమ్మకానికి ఉంచారు. ఈయన 2002లో జరిగిన వేలంలో 7.6 మిలియన్ డాలర్లకు ఈ నాణేన్ని దక్కించుకున్నారు. ఈ నాణెం ముఖ విలువ 20 డాలర్లు. దీనికి ఓ వైపు అమెరికన్ ఈగిల్, మరోవైపున స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముద్రించి ఉంటుంది. ఈ నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ఈ నాణేలను నిషేధించారు. అప్పటివరకు సాధారణ ప్రజల వద్ద ఉన్న ఈ నాణెలు కరిగించబడ్డాయి. ఆ సమయంలో నెలకున్న బ్యాంకింగ్ సంక్షోభానికి ఇది సహాయపడుతుందని రూజ్‌వెల్ట్ భావించారు. అయితే కొద్ది మొత్తంలో ఈ నాణేలు ముద్రణాలయం నుంచి బయటకు వచ్చాయి. ఏలా వచ్చాయి అన్నది మాత్రం స్పష్టం తెలియదు. కానీ, ఈ నాణేలను కలిగి ఉండటం అనేది చట్టవిరుద్ధం. ఎవరి వద్దనైనా ఈ నాణెం ఉందని తెలస్తే దాన్ని తక్షణ స్వాధీనం చేసుకునేవారు. కానీ, ఇవి ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకునే లోపే దేశం దాటి పోయింది. తొలుత ఈజిప్ట్ రాజు ఫరూక్ దగ్గర ఉండేది. ఆ తర్వాత దీనిని ఓ ప్రయివేట్ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. తిరిగి వేలంలో విక్రయించి భారీ మొత్తాన్ని పొందాడు. కాగా, బ్రిటిష్ గుయానా 1856లో విడుదల చేసిన ఒక్క సెంట్ మెగ్నేటా స్టాంపు‌ను కూడా వెయిట్జ్‌మన్ రికార్డుస్థాయికి అమ్మడం మరో విశేషం. ఈ స్టాంపు 8.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి అత్యంత విలువైనదిగా చరిత్రకెక్కింది. నాటి స్టాంపుల్లో ఇదొక్కటే ఇప్పటి వరకూ మనుగడలో ఉండటం మరో ప్రత్యేకత.


By June 10, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-double-eagle-gold-coin-sells-for-record-setting-18-9-million-in-auction/articleshow/83389343.cms

No comments