Breaking News

అంత మాట అనేసి కన్ను కొట్టేసింది.. వనిత విజయ్ కుమార్ పోస్ట్‌పై కొంటె కామెంట్లు!


వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా ఆమెను గుర్తించే వారి కంటే.. వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. మరీ ముఖ్యంగా గత ఏడాది వనిత చేసిన వీరంగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వనిత మూడో పెళ్లి మీడియాలో ఎంతటి సెన్సేషన్‌గా మారిందో అందరికీ తెలిసిందే. పీటర్ పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వనిత.. చివరకు తిరిగి తిరిగి మళ్లీ ఒంటరిగానే మిగిలారు. పీటర్ పాల్ మొదటి భార్య పెట్టిన కేసుతో అసలు కథ అడ్డం తిరిగింది. అలా మొత్తానికి తన మూడో భర్తను వనిత వదిలించుకున్నారు. అలా వనిత మళ్లీ తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గత ఏడాది జూన్ 27న వనిత పీటర్ పాల్ వివాహాం జరిగింది. తనకు ఇంకా విడాకులు కాలేదని, అలాంటి స్థితిలో తన భర్త వనితను ఎలా పెళ్లి చేసుకుంటారని పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సెలెబ్రిటీలు, నెటిజన్లు, సమాజం అంతా కూడా ఎలిజబెత్‌కు సపోర్ట్ చేసింది. మరీ ముఖ్యంగా కొంత మంది సెలెబ్రిటీలు నేరుగా రంగంలోకి దిగి వనితను ఏకిపారేశారు. అలా వనిత వారందరితో ఒంటరి పోరాటం చేశారు. ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసినా వనిత మాత్రం వెనుకడుగు వేయలేదు. అయితే వ్యవహారం పోలీసులు, కోర్టు అంటూ తిరిగినా కూడా వనిత మాత్రం తన భర్తతో కలిసి బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్రమంలో తన కూతురి బర్త్ డే వేడుకల కోసం గోవాకు వెళ్లారు. అక్కడ పీటర్ పాల్ మద్యం సేవించడం, అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇంట్లోంచి వనిత గెంటేశారంటూ వార్తలు వచ్చాయి. అలా ఆ మూడో పెళ్లి కూడా పెటాకులు అయింది. వనిత మూడో పెళ్లి కూడా ఇలా ముగిసిపోవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయన పరిస్థితి బాగా లేదని, నిత్యం మద్యం సేవిస్తున్నారని, ఆయన ఆస్పత్రిలో ఉంటే దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టానంటూ వనిత చెప్పుకొచ్చారు. మొత్తానికి తామిద్దరం విడిపోయామని వనిత స్పష్టంగా చెప్పేశారు. అయితే మధ్యలో వనిత మరో పోస్ట్ చేశారు. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను అంటూ వనిత ఓ పోస్ట్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ వీటిపై ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఈ మధ్య తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై రూమర్లు రాసాగాయి. వీటిపై వనిత స్పందిస్తూ.. బయట వినిపించే వాటిని నమ్మకండి.. మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను.. నేను సింగిల్..అందరికీ అందుబాటులోనే ఉన్నాను.. (కన్ను కొట్టిన ఎమోజీ).. ఎవ్వరూ కూడా రూమర్లను నమ్మకండి అంటూ చెప్పేశారు. ఇలా కన్ను కొట్టిన ఎమోజీని షేర్ చేయడం..సింగిల్‌గా ఉన్నా అవైలబుల్‌గా ఉన్నానంటూ చెప్పడంపై నెటిజన్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు.


By June 10, 2021 at 07:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vanitha-vijayakumar-naughty-comments-on-her-relationship-status/articleshow/83389210.cms

No comments