Third Front కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యం.. తేల్చిచెప్పిన శరద్ పవార్!
లేకుండా బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యమని సీనియర్ నేత, ఎన్‌సీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. పవార్ నివాసంలో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పాటుపై ఊహగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ తాజాగా స్పందించారు. రాష్ట్ర మంచ్ సమావేశంలో మూడో కూటమి గురించి చర్చించలేదన్నారు. కానీ, ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రస్తావన వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్తేనే సాధ్యమవుతుందని తాను స్పష్టం చేశానని పేర్కొన్నారు. ‘‘ఇటీవల జరిగిన సమావేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించలేదు.. కానీ, ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేయలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుంది. మాకు అలాంటి శక్తి అవసరం.. నేను ఆ సమావేశంలో ఈ విషయం చెప్పాను’’ అని అన్నారు. ఒకవేళ ఏదైనా కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. అయితే, కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు పవార్ సమాధానం దాటవేశారు. శరద్ పవార్ ఇంతకు ముందు చాలాసార్లు ప్రయత్నించారని అన్నారు. ఎన్‌సీపీ అధినేతతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వరుసగా భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కానీ, మంగళవారం జరిగిన సమావేశాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంది. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా స్థాపించిన రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవార్ నేతృత్వం వహించారు. మొత్తం ఎనిమిది రాజకీయ పార్టీలు, సినీ, న్యాయ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లేదా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు శరద్ పవార్ తెరదించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించలేదు కానీ, వ్యతిరేక కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ మంత్రాంగంలో శరద్ పవార్‌ది అందవేసిన చేయి. మహారాష్ట్రలో సిద్ధాంతపరంగా భిన్నమైన శివసేన.. ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో పవార్ కీలక భూమిక పోషించారు.
By June 26, 2021 at 07:46AM
No comments