Breaking News

జార్జ్ ఫ్లాయిడ్ కేసులో సంచలన తీర్పు.. పోలీస్ అధికారికి 22 ఏళ్లకుపైగా జైలు శిక్ష


నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కేసులో మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తాజాగా, మాజీ పోలీస్ అధికారికి మినియాపోలీస్ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. డెరెక్ చౌవిన్‌కు 22 సంవత్సరాల ఆరు మాసాలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. శిక్ష ఖరారుకు ముందు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపి క్షమాపణలు చెప్పారు. న్యాయమూర్తి పీటర్ కాహిల్ శిక్ష ఖరారు చేస్తూ.. ‘ఇది (జైలు శిక్ష) మీ నమ్మకం, అధికార దుర్వినియోగం, జార్జ్ ఫ్లాయిడ్ పట్ల చూపించిన ప్రత్యేకమైన క్రూరత్వంపై ఆధారపడి ఉంటుంది’చౌవిన్‌తో అన్నారు. ఈ తీర్పు అమెరికాలో జాతిసయోధ్యకు చారిత్రాత్మకమైన తొలి అడుగు అని ఫ్లాయిడ్ కుటుంబ న్యాయవాది వ్యాఖ్యానించారు. ‘జవాబుదారీతనం ఇవ్వడం ద్వారా ఫ్లాయిడ్ కుటుంబాన్ని, మన దేశానికి స్వాంతచేకూర్చడానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువస్తుంది’ అని లాయర్ బెన్ క్రంప్ ట్వీట్ చేశారు. ఈ తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ‘పరిగణనలోకి తీసుకున్న పరిస్థితులు నాకు తెలియదు కానీ, మార్గదర్శకాల ప్రకారం ఇది సముచితంగా అనిపిస్తుంది’ అని అన్నారు. జవాబుదారీతనానికి ఇదోరం సందేశం పౌర హక్కుల ఉద్యమకర్త అల్ షార్పటన్ తెలిపారు. విచారణ సమయంలో ఫ్లాయిడ్ కుటుంబానికి కనీసం సానుభూతి చెప్పడానికి కూడా ఫ్లాయిడ్ నిరాకరించారు. ఇక, న్యాయస్థానం విధించిన శిక్షపై క్లుప్తంగా మాట్లాడిన డెరెక్ చౌవిన్.. ఈ సమయంలో నేను పూర్తిస్థాయి ప్రకటన చేయలేనని వ్యాఖ్యానించాడు. ‘ఈ సమయంలో కొన్ని అదనపు చట్టపరమైన విషయాల కారణంగా పూర్తి అధికారిక ప్రకటన ఇవ్వలేను. భవిష్యత్తులో ఆసక్తికర సమాచారం వెల్లడిస్తారు.. ఈ విషయాలు మీకు కొంత మనశ్శాంతిని ఇస్తాయని నేను ఆశిస్తున్నాను’అని అన్నాడు. తన కుమారుడు చాలా మంచి వ్యక్తి అని అంతకు ముందు చౌవిన్ తల్లి కరోలిన్ పాలెంటీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, జార్జ్ ఫ్టాయిడ్ మృతిపై మరో ముగ్గురు పోలీసు అధికారులు కూడా అభియోగాలు నమోదయ్యాయి. వారి విచారణ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. 2020 మే 25న ఫేక్ కరెన్సీని సరఫరా చేశాడనే ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలిస్ అధికారి డెరెక్.. రోడ్డుపై పడుకోబెట్టి మెడపై కాలితో తొక్కుతూ అతికిరాతంగా పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.


By June 26, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-ex-police-officer-derek-chauvin-sentenced-to-over-22-years-for-george-floyd-murder/articleshow/83863420.cms

No comments