Kodali Nani: సన్నబియ్యం సన్నాసి, నల్లగడ్డం గాడిద, నీ **మొగుడు మంత్రి: కొడాలి నానిపై దివ్యవాణి తిట్ల పురాణం
వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హీనమైన భాషలో ప్రజా ప్రతినిధులమనే ఇంగితం విడిచేసి వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒరేయ్ తురేయ్ అని లోకేష్ తీవ్ర హెచ్చిరికలు జారీ చేస్తే.. నిన్ను శాసన మండలిలోనే కుక్కని కొట్టినట్టు కొడతాం అని డైరెక్ట్ ఎటాక్ చేశారు మంత్రి . ప్రెస్ మీట్ పెట్టిమరీ తనదైన శైలిలో లోకేష్ బాబుని ఫుడ్ బాల్ ఆడేశారు మంత్రి కొడాలి నాని. అయితే కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తిట్ల దండకం అందుకుంది టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి . ‘నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. చంద్రబాబు లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని.. మీ తండ్రి వయసు ఉన్న నాయకుడ్ని మీరు గాడిద అని మాట్లాడితే.. ఒరేయ్ నల్లగడ్డం గాడిద అని అనడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. చంద్రబాబు గారి నడకలోను రాజసం ఉంది.. అంతేకాని ఒక రౌడీలా షర్ట్ బటన్స్ వదిలేసి రొమ్ము విరుచుకుని నేనే రౌడీని అని కెమెరాల ముందుకు రాలేదు. కాబట్టి చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు అని తెలుసుకోండి. మీరు పేరు కొడాలి నాని మాత్రమే.. అంతే గాని గడ్డం గాడిద.. బూతుల మంత్రి.. సన్న బియ్యం సన్నాసి.. నీ అమ్మ మొగుడు అలాంటి పేర్లు కాకుండా కొడాలి నానిగా పరిపాలన చేయండి’ అంటూ కొడాలి నానిపై బూతులతో విరుచుకుపడింది దివ్యవాణి.
By June 19, 2021 at 11:22PM
No comments