Breaking News

KGF-2 రిలీజ్ కోసం సన్నాహాలు! ఇక ఆలస్యం చేయొద్దని డైరెక్టర్ అలా ఫిక్సయ్యారట..


గతేడాది మొదలుకుంటే ఇప్పటిదాకా కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్ బోసి పోయాయి. మధ్యలో కొన్ని నెలలు ఓపెన్ అయినా తిరిగి కరోనా విజృంభించడంతో మళ్ళీ కళ తప్పాయి. అయితే ఇప్పుడు క్రమంగా పరిస్థితులు చక్కబడుతుండటంతో పెండింగ్‌లో ఉన్న సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ లిస్టులో భారీ సినిమా కూడా ఉంది. హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో సరైన రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తోంది. యష్ డ‌బ్బింగ్‌ స్టార్ట్ చేశారు. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని భావిస్తున్న ప్రశాంత్ నీల్.. జులై నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు సమాచారం. గతంలోనే జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ కానుందని తెలపడంతో యష్ ఫ్యాన్స్ ఆ డేట్‌పై దృష్టి పెట్టారు. తొలి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలనే కోరికతో ఆ రోజును జాతీయ సెలవు దినం (నేషనల్ హాలీడే)గా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఆ డేట్‌లో రిలీజ్ చేయడం సాధ్యపడకపోతుండటంతో కొత్త డేట్ కోసం అన్వేషిస్తున్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్-1 కు కొనసాగింపుగా ఈ కేజీఎఫ్ చాప్టర్-2 రాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, సీనియర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ కీల‌క పాత్ర‌ పోషిస్తోంది.


By June 24, 2021 at 07:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/yash-latest-update-on-kgf-2-new-release-date/articleshow/83797834.cms

No comments