Breaking News

Jagapathi Babu: నేను ఆనందయ్య ముందు వేసుకున్నా.. కరోనా రాలేదు: జగపతిబాబు


నెల్లూరు మందుపై సామన్య జనమే కాదు సెలబ్రిటీలు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆనందయ్య మందు పంపిణీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. సీనియర్ హీరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆనందయ్య మందు తాను ఎప్పుడో వేసుకున్నానని.. ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతానని అన్నారు జగపతి బాబు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అందరికంటే ముందుగా ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో నేను ఒకడ్ని. ఆల్రెడీ నేను ఆనందయ్య మందు వాడాను.. నాకు కరోనా రాలేదు. అది ఇప్పుడు చెప్తున్నా. నేను ఒక్కటే నమ్ముతున్నా.. ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను. ఎవడేం నమ్మినా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు అయితే ఉండవు.. ఖచ్చితంగా మంచే జరగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. లక్కీగా నాకు ఇప్పటివరకూ నాకు కోవిడ్ రాలేదు.. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు జగపతి బాబు. అంతకుముందు ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు జగపతిబాబు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చిందని.. ఈ మందు శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది ఈ ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. అతన్ని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అని ఆయన పేర్కొన్నారు జగపతిబాబు.


By June 05, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-jagapathi-babu-revealed-real-facts-about-anandayya-medicine/articleshow/83253172.cms

No comments