Breaking News

మేకిన్ ఇండియాకు బిగ్ బూస్ట్.. 43వేల కోట్లతో ఆరు అధునాతన సబ్‌మెరైన్లు


‘’ కార్యక్రమంలో భాగంగా నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసేలా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు సంప్రదాయ కోసం ఉద్దేశించిన రూ.43,000 కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ‘రక్షణ కొనుగోళ్ల మండలి’ (డీఏసీ) సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ‘వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్’ కింద ఈ సబ్-మెరెన్లను నిర్మిస్తారు. దేశీయ సంస్థలు.. అంతర్జాతీయ ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత్‌లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం దీని ఉద్దేశం. డీఏసీ ఆమోదం తెలిపిన సబ్‌మెరైన్‌ల ప్రాజెక్టును పి-75 (భారత్)గా పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కింద నిర్మించే సబ్‌మెరైన్లలో అధునాతన ‘ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌’ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువ సేపు నీటి అడుగున ఉండగలవు. శత్రువులకు రాడార్లకు చిక్కకుండా స్టెల్త్‌ పరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తారు. ‘వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్’ కింద చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ‘మేకిన్ ఇండియా’ కింద చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి వేగంగా బదిలీ చేయడానికి, దేశీయ కంపెనీలు దాన్ని త్వరగా గ్రహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. భారత్‌లో జలాంతర్గాముల నిర్మాణానికి అంచలంచెలతో కూడిన పారిశ్రామిక మౌలిక వసతులను సృష్టించడానికి ఇది దోహదపడుతుంది’’ అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది. వీటిలో అమర్చే ఆయుధ వ్యవస్థలను బట్టి ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉంది. ముంబయిలోని మజగావ్ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), ప్రైవేటు సంస్థ ఎల్‌ అండ్‌ టీలు టెండర్లు వేసేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీలు.. రోసోబోరాన్‌ ఎక్స్‌పోర్ట్‌ (రష్యా), దేవూ (దక్షిణ కొరియా), టీకేఎంఎస్‌ (జర్మనీ), నవాంటియా (స్పెయిన్‌), నేవల్‌ గ్రూప్‌ (ఫ్రాన్స్‌) ఐదు విదేశీ నౌకా నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. అనంతరం కాంట్రాక్టు కోసం బిడ్లు దాఖలు చేస్తాయి. వీటిని పరిశీలించి, ఒక కంపెనీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. వీటితో పాటు విమానవాహక నౌకలపై మోహరించే 57 యుద్ధ విమానాలు, 111 హెలికాప్టర్లు, 123 బహుళ ప్రయోజన హెలికాప్టర్లను సమకూర్చుకునేందుకు భారత్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తాజా డీఏసీ సమావేశంలో రూ.6,800 కోట్లతో సైన్యానికి ఎయిర్ డిఫెన్స్ గన్స్, పేలుడు సామాగ్రిసహా పలు ఆయుధాల కొనుగోలుకూ ఆమోదం తెలిపింది. సైన్యం చేపట్టే అత్యవసర ఆపరేషన్ల కోసం ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించిన కాలపరిమితి ఆగస్టు 31 వరకూ పొడిగించింది.


By June 05, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-conventional-submarines-for-43000-crore-in-big-make-in-india-boost/articleshow/83253165.cms

No comments