అల్లు స్నేహారెడ్డి కూడా మొదలుపెట్టేసింది.. ఫాలోయింగ్‌ను ఇలా వాడేసుకుంటోందా?
అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే బన్నీకి తగ్గట్టుగానే కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. బన్నీ భార్య అనే ట్యాగ్‌తోనే స్నేహారెడ్డికి ఈ రేంజ్ ఆధరణ దక్కింది. అయితే ఆమె షేర్ చేసే వీడియోలు, ఇచ్చే అప్డేట్లే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం. అలా అల్లు స్నేహారెడ్డడి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకపోస్ట్ చేస్తుంటారు. మొన్నీ మధ్య స్నేహారెడ్డి అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశారు. స్టార్ హీరోల భార్యల్లో అల్లు స్నేహారెడ్డికి మాత్రమే ఇంతటి క్రేజ్ దక్కింది. ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్నారు. అయితే స్నేహారెడ్డికి వచ్చిన ఈ క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా అర్హ, అయాన్, అల్లు అర్జున్‌లకు సంబంధించిన విషయాలనే షేర్ చేసే స్నేహారెడ్డి తాజాగా ఓ ప్రొడక్ట్ గురించి పోస్ట్ చేసి ప్రమోట్ చేస్తోంది. ఇలా సౌందర్య ఉత్పత్తులకు స్నేహారెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదే మొదటి సారి. చర్మ సౌందర్యం, కేశాల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను అల్లు స్నేహారెడ్డి ప్రమోట్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా కూడా సొమ్ము చేసేసుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జుట్టుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం, సాయం చేసేందుకు సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఒత్తైన, పొడవు జుట్టు కోసం పూర్తి ఆయుర్వేదంతో తయారైన ఈ ఆయిల్‌ను వాడండి అని స్నేహారెడ్డి సూచించారు.
By June 27, 2021 at 02:48PM
No comments