అల్లు అర్జున్‌తో క్లాస్ రూములో ఒంటరిగా.. ఆ టైమ్‌లో మేమిద్దరం! యంగ్ బ్యూటీ అనన్య షాకింగ్ కామెంట్స్
టెక్నాలజీ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ కంటెంట్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కొత్త సినిమా అంటే వెండితెర మాత్రమే అన్నట్లుగా ఉండే రోజులు.. ఓటీటీల రాకతో నేరుగా ఇంట్లోకే సినిమా అన్నట్టుగా మారిపోయాయి. దీంతో కంటెంట్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌లు, వాటిలో నటించే నటీనటులకు మంచి పాపులారిటీ దక్కుతోంది. అలాంటి నటుల్లో ఒకరే . రీసెంట్‌గా వచ్చిన అనే యూ ట్యూబ్ సీరీస్ ద్వారా ఫేమ్ అయిన ఈ తెలుగమ్మాయి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఏకంగా అల్లు అర్జున్‌తో ఒకసారి క్లాస్ రూమ్‌లో ఏకాతంగా సిట్టింగ్ వేసినట్లు చెప్పి షాకిచ్చింది. తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెబుతూ తన క్లాస్ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని అల్లు అర్జున్‌తో ముచ్చట్లు పెట్టినట్లు చెప్పింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. ఇదంతా నిజ జీవితంలో కాదట. తన కలలోకి అల్లు అర్జున్ వచ్చి ఇలా మాట్లాడారని అనన్య చెప్పుకొచ్చింది. అయితే ఎప్పటికైనా అల్లు అర్జున్‌ను కలవడం తన డ్రీమ్ అని చెబుతూ కోరిక బయటపెట్టింది అనన్య. ఇకపోతే తన కెరీర్, సినిమాల గురించి మాట్లాడిన అనన్య.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంపైనే ఉందని చెప్పింది. చదువు పూర్తయ్యాక వచ్చే అవకాశాలను బట్టి వాటిలో నటించాలా వద్దా? అనే నిర్ణయం తీసుకుంటానని ఆమె చేద్దాం విశేషం. ప్రస్తుతం ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు ఆమె తెలిపింది. ఏదేమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో కలలు కంటోందంటే ఈ అమ్మడి గురి పెద్దదే అయి ఉండొచ్చు మరి!.
By June 15, 2021 at 12:52PM
No comments