మా బాబు గోల్డ్.. ఆ మాటకు అంతా ఫిదా.. రామ్ చరణ్‌పై దర్శకుడి కామెంట్స్ వైరల్
మెగా పవర్ స్టార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై నటనతోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు ప్రస్తుతం కూల్ మోడ్‌లోనే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్‌లో ఎంతో మార్పు కనిపిస్తూ వస్తోంది. అయితే మరీ ముఖ్యంగా రామ్ చరణ్ మెగా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ తనను పలకరించడానికి పాదయాత్ర చేసిన అభిమానిని కలిశారు. తన స్వగృహానికి ఆ అభిమానిని పిలిచి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఇలా ఎందుకు వచ్చారు? ఎన్ని రోజులుగా ప్రయాణం చేశారు?అంటూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ అభిమానిని అభిప్రాయాలను కూడా తెలుసుకుని గౌరవించారు. లోపలకి వెళ్లి మాట్లాడుకుందామా? అని రామ్ చరణ్ ఆ అభిమానిని అడిగారు. పక్కనే ఉన్న స్వామి నాయుడిని చూపిస్తూ ఈయనను కూడా లోపలకు రమ్మంటారా? లేదా నాతోనే పర్సనల్‌గా మాట్లాడతావా? అని ఫ్యాన్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇక ఈ మాటతో అందరూ ఫిదా అయ్యారు. బాబు బంగారం అంటూ నెటిజన్లు, ఫ్యాన్సు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హృదయకాలేయం ఫేమ్ ఈ వీడియోపై స్పందిస్తూ రామ్ చరణ్‌ను పొగిడేశారు.
By June 27, 2021 at 06:05PM
No comments