మధ్యప్రదేశ్‌లో కలకలం.. డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు
‘డెల్టా ప్లస్’ వేరియంట్‌తో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ఒకవేళ అదే జరిగితే సెకండ్ వేవ్‌కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌కు సంబంధించి 40 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దేశంలోనే తొలి మరణం మధ్యప్రదేశ్‌లో నమోదయ్యింది. కోవిడ్-19తో మృతిచెందిన వ్యక్తి నమూనాలను సేకరించి, జన్యు పరీక్షలు నిర్వహించడంతో ఈ విషయం బయటపడింది. ఉజ్జయినికి చెందిన మహిళ ‘డెల్టా ప్లస్’ వేరియంట్ వల్ల మృతిచెందినట్టు అధికారులు బుధవారం తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ‘డెల్టా ప్లస్’ కేసులు ఐదు నమోదయ్యాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు బయటపడ్డాయి. ఈ వేరియంట్ సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకోగా.. ఓ రోగి చనిపోయింది. బాధిత మహిళ మే 23న మృతిచెందినట్టు ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు. తొలుత ఆమె భర్తకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ఆమె భర్త టీకా రెండు డోస్‌లు వేసుకోగా.. బాధితురాలికి ఒక్క డోస్ పూర్తయినట్టు అధికారులు గుర్తించారు. కాగా, పరిస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తోందని మధ్యప్రదేశ్ వైద్య విద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. ‘డెల్టా ప్లస్’ వేరియంట్ నిర్దారణ అయిన బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించామని, వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అన్ని ఆస్పత్రులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని తెలిపారు. ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే టెస్టింగ్, జన్యు విశ్లేషణ పరీక్షలను పెద్ద మొత్తంలో చేస్తున్నామని తెలియజేశారు. ‘ఆసక్తికర విషయం ఏంటంటే ఐదుగురిలో నలుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్‌గా రావడం.. టీకా వేసుకున్న వీరంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. టీకా వేసుకోని రోగి చనిపోయాడు.. కాబట్టి ప్రతి ఒక్కళ్లూ టీకా వేసుకోవాలి’అని మంత్రి సూచించారు.
By June 24, 2021 at 10:47AM
No comments