‘96’పై ఈ మెగా హీరో మనసు పడ్డాడట!!
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ఓ తమిళ మూవీ చూసి ఫిదా అయ్యాడట. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ‘96’ మూవీని చూసిన బన్నీ.. దీన్ని తెలుగులో ఎట్టిపరిస్థితుల్లో రీమేక్ చేయాలనీ చూస్తున్నాడట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ కొనేశారు.
అయితే అల్లు అర్జున్.. దిల్ రాజు దగ్గరకు వెళ్లి రీమేక్ రైట్స్ తనకు ఇవ్వమని కోరాడట. ఎవరుతో రీమేక్ చేయాలనే దానిపై ఇద్దరి దగ్గర సమాధానం లేదట. మన తెలుగులో.. విజయ్ సేతుపతిలా నలభైకి పైబడి ఎవరు నటిస్తారు? అటువంటి క్యారెక్టర్‌కి ఎవరైతే కరెక్ట్‌గా సూట్ అవుతారో ఇద్దరికీ అర్ధం కావట్లేదట. మన తెలుగులో కొందరు వున్నా వారికి స్టార్ ఇమేజ్ వుండడం వల్ల వారికి ఈ కథ సూట్ అవదు.
సో.. అలా అది ఇంకా డిస్కషన్స్‌లోనే ఉంది. అల్లు అర్జున్ ఎప్పటి నుండో నిర్మాణ రంగంలోకి డైరెక్టుగా దిగి తన టేస్ట్‌కి తగ్గ సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ ఇది సెట్ అయితే అల్లు అర్జున్ తన బ్యానర్‌లో తీసే మొదటి సినిమా ఇదే అవుతుంది. కానీ దిల్ రాజు..బన్నీల మధ్య ఎలాంటి డీల్ అయితే ఇప్పటి వరకు కుదర్లేదు. ఒకవేళ దిల్ రాజు.. అల్లు అర్జున్‌ని కలుపుకుని ఈ సినిమాను నిర్మిస్తారేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయం. ఒకవేళ ఎవరు ఇందులో నటించకపోతే అల్లు అర్జునే నటించే అవకాశం కూడా ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
By November 21, 2018 at 06:51AM
No comments