Breaking News

అతి తీవ్ర తుఫానుగా దూసుకొస్తున్న YAAS.. తీర్పు తీరానికి ఆరెంజ్ అలర్ట్


తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’తుఫాను సోమవారం అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఇది మంగళవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుఫానుగా రూపాంతంరం చెందుతుందని పేర్కొంది. గత ఆరు గంటలుగా నుంచి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర- వాయవ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఈ తుఫాను ఒడిశాలోని పరాదీప్‌, బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ-ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుఫానుగా మారుతుంది. మే 26న తెల్లవారుజామున ఒడిశా-బెంగాల్‌ మధ్య తీరానికి చేరువవుతుందని, అదే రోజు మధ్యాహ్నం పరాదీప్-సాగర్ ఐల్యాండ్ మధ్య అతి తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అతి తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గాలుల వేగం గంటకు 120 నుంచి 185 కిలోమీటర్ల ఉంటుందని తెలిపింది. మే 26న తీరం దాటే సమయానికి 185 కిలోమీటర్ల వేగంతోనే బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. తీరం దాటిన తర్వాత తుఫాను బలహీనపడి తీవ్ర తుఫానుగా, అనంతరం వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. కారణంగా ఒడిశా- పశ్చిమ్ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర తీరంలో నేడు (మే 25) చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 25, 26న ఒడిశాలోని పూరి, జగత్సింగ్‌పూర్, ఖుర్దా, కటక్, కేంద్రపడ, జైపూర్, భద్రక్, బలాసోర్, ఢెంకనాల్, మయూర్బంజ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురుస్తుంది. బెంగాల్‌లో అతిభారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఝార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో మే 26, 17 తేదీల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


By May 25, 2021 at 06:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclonic-storm-yaas-intensify-into-very-severe-cyclone-in-bay-of-bengal/articleshow/82928150.cms

No comments