Breaking News

Halo అకాశంలో అద్భుతం.. బెంగళూరులో గంటపాటు కనువిందు


ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు ఓ వలయంలా ఏర్పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సుమారు గంటపాటు ఈ వలయం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన బెంగళూరు వాసులు... ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆకాశం నిర్మలంగా ఉండటంతో.. చాలా మంది బెంగళూరు వాసులు ఈ వలయాన్ని చూడగలిగారు. వాతావరణంలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయి. దీన్నే కెలడోస్కోప్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. సూర్యుడి చుట్టూ మేఘాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి వలయం ఏర్పడుతుంది. ఈ వలయాకార ఇంద్రధనస్సు వ్యాసార్థం.. దాదాపు సూర్యుడి చుట్టూ 22 డిగ్రీలు ఉంటుంది. అందుకే దీన్ని ‘’ అని కూడా పిలుస్తారు. శీతల దేశాల్లో ఈ వలయం తరచుగా ఏర్పడుతుంది. కానీ మన దగ్గర అరుదుగా ఏర్పడుతుంది. ‘‘హాలో అనేది సూర్యుడు లేదా చంద్రుడు నుంచి 22 డిగ్రీల కాంతి వలయం.. అత్యంత సాధారణమైన ఈ షట్కోణం అకారంలో మంచు బిందువులు స్ఫటికంలా ప్రకాశిస్తాయి’’ అని ఇల్లినాయిస్ వర్సిటీ పేర్కొంది. మేఘాలు మిలియన్ల కొద్దీ చిన్న మంచు స్ఫటికాలను కలిగి ఉంటాయి.. ఇవి వృత్తాకార ఇంద్రధనస్సు రూపంలో కాంతిని వక్రీకరించడం, విభజించాయి, ప్రతిబింబిస్తాయి. హాలో స్ఫటికాలు మన కంటికి కనిపించాలంటే ఆధార స్థానం కలిగి ఉండాలి. గత ఏడాది ఆగష్టులో తమిళనాడులోని రామేశ్వరంలో ఇలాంటి వలయం కనిపించింది. అంతకు కొద్ది రోజుల ముందు జులై నెలలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోనూ ఇలాంటి వలయం ఏర్పడింది. రామాలయ గోపురంపై సూర్యుడి చుట్టూ కనిపించిన వలయం చూపరులను అబ్బురపరిచింది.


By May 25, 2021 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/the-22-degree-ring-forms-around-sun-bengaluru-witness-rare-suns-halo/articleshow/82928360.cms

No comments