Breaking News

Surprising: కొట్టరు.. తిట్టరు.. పెన్నూ, పేపర్‌తోనే పనిష్మెంట్!!


రూల్స్ దాటి ఎవరైనా ప్రవర్తిస్తే లాఠీలతో కుళ్లబొడవడం పోలీసుల స్టైల్. మరీ చిన్న చిన్న తప్పులకు ఏం కొడతాం అనుకుంటే గుంజీలు తీయించడమూ చూసుంటారు. మరికొందరు వినూత్నంగా కప్పగెంతులు కూడా వేయిస్తుంటారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం మరింత వెరైటీ. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే పెన్నూ పుస్తకమిచ్చి వినూత్నమైన శిక్ష విధిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వారు ‘రామరామ’ అని రాసి వెళ్లాలట!! కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు విధించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అయినా పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు సాత్నా జిల్లా పోలీసులు వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు. రూల్స్ పాటించని వారి చేతికి పెన్నూ, పుస్తకమిచ్చి రామ నామం రాయిస్తున్నారు. డెయిరీలో ఓ పేజీ నిండా రామ రామ అని రాయించి పంపుతున్నారు. అయితే ఈ పనిష్మెంట్ ఉల్లంఘనులకు ఈజీగానే ఉన్నా.. రామ నామం రాయించడం ఆసక్తికరంగా మారింది. Also Read:


By May 16, 2021 at 03:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lockdown-violators-are-being-asked-to-pen-down-the-name-of-lord-ram-in-satna-district/articleshow/82679093.cms

No comments