Breaking News

ప్లాస్మా చికిత్స వల్ల ప్రయోజనం లేదు.. ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు


ప్లాస్మా చికిత్సపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా బాధితులకు విధానం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనిని ఎయిమ్స్ స్పష్టం చేసింది. కోవిడ్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం గుర్తించినట్టు ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స ప్రభావంపై అంచనా వేసేందుకు 15 మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై ప్రయోగాత్మక పరిశోధనలు జరిపినట్లు వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స.. మరో బృందానికి సాధారణ పద్ధతితోపాటు ప్లాస్మా చికిత్సను అందజేశారు. ఈ రెండు విధానాల్లోనూ మరణాలు రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో గుర్తించామని గులేరియా వివరించారు. అయితే, దీనిపై సష్టత కోసం మరింత పరిశోధన అవసరమని అన్నారు. దీంతో శుక్రవారం సమావేశమైన ఐసీఎంఆర్- కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులందరూ ప్లాస్మా చికిత్సను సిఫార్సు చేయరాదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కోవిడ్ రోగులపై ఇది ఏమాత్రం ప్రభావం చూపడంలేదని పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్ నిర్ధారణ అయి.. మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారు ప్రారంభ దశలో ప్లాస్మా థెరపీకి అనుమతిస్తుంది. కోవిడ్ లక్షణాలు మొదలైన ఏడు రోజులలో అధిక యాంటీబాడీలున్న ప్లాస్మా దాత అందుబాటులో ఉంటే చికిత్స చేయవచ్చు. కోవిడ్ బాధితులకు ప్లాస్మా చికిత్స అశాస్త్రీయ విధానమని పలువురు నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు కె విజయరాఘవన్‌కు రాసిన నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను నుంచి దీనిని తొలగించడం గమనార్హం. తక్కువ సంఖ్యలో యాంటీబాడీలున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసి, దానిని వేరే రోగులకు చికిత్సలో ఉపయోగిస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


By May 16, 2021 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/plasma-therapy-not-effective-to-be-dropped-from-covid-clinical-management-guidelines/articleshow/82678752.cms

No comments