Breaking News

Humanity: కూతురి పెళ్లికి తండ్రి వెలకట్టలేని కానుక.. హ్యాట్సాఫ్!!


కూతురి పెళ్లి కోసం దాచి ఉంచిన డబ్బును కరోనా కష్టకాలంలో పేదోళ్లకు దానం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాడో తండ్రి. లాక్‌డౌన్‌తో తన కూతురి వివాహం ఇంట్లోనే నిరాడంబరంగా జరిపించి.. పెళ్లి కోసం ఉంచిన డబ్బును 40 మంది పేదలకు పంచిపెట్టాడు. కర్ణాటకలోని మైసూరుకి చెందిన హరీశ్.. ఈ నెల 12న తన కూతురి వివాహం జరిపించాలని నిర్ణయించాడు. అందుకోసం ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇంతలో కరోనా విలయతాండవం కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలపై కూడా నిషేధాజ్ఞలు విధించింది. దీంతో హరీశ్ అనుకున్న సమయానికే లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించి నిరాడంబరంగా తన కూతురి వివాహం జరిపించాడు. అయితే కూతురి పెళ్లి ఘనంగా చేసేందుకు కూడబెట్టిన డబ్బును కష్టాల్లో ఉన్న పేదలకు పంచేయాలని నిర్ణయించుకున్నాడు హరీశ్. అనుకున్నదే తడవుగా అతను దాచి ఉంచిన రెండు లక్షల రూపాయలను నలభై మంది పేదలకు రూ.5 వేలు చొప్పున దానం చేశారు. కష్టకాలంలో పేదోళ్లపై మానవత్వం చూపిన హరీశ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. Also Read:


By May 16, 2021 at 04:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-man-donates-daughters-marriage-money-to-poor-people-in-corona-surge/articleshow/82679896.cms

No comments