Breaking News

Hanuman Beniwal: మోదీ ప్రభుత్వంపై పాతమిత్రుడి ఫైర్.. ఈసీనీ వదల్లేదు.!


కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమయ్యారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాజస్థాన్‌‌కి చెందిన రాష్ట్రీయ్ లోక్‌తాంత్రిక్ పార్టీ అధినేత, నాగౌర్ ఎంపీ . కేంద, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన మండిపడ్డారు. కరోనా ఉధృతికి ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిందని.. వాటిని వాయిదా వేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితులకు ప్రభుత్వాలతో పాటు ఈసీకి కూడా సమాన బాధ్యత ఉందన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. తక్షణమే ఆరోగ్య మంత్రి రఘు శర్మ రాజీనామా చేయాలని బేణీవాల్ డిమాండ్ చేశారు. హనుమాన్ బేణీవాల్ గతంలో బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. 2013లో ఆయన బీజేపీ నేతలతో విభేదించి పార్టీ నుంచి బయటికి వచ్చారు. అప్పటి వసుంధరా రాజే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సొంతంగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీని స్థాపించారు. 2018 ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసనలకు దిగారు. Also Read:


By May 16, 2021 at 05:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-ex-bjp-ally-slams-centre-state-government-and-election-commission-over-covid-crisis/articleshow/82680579.cms

No comments