Breaking News

సినిమా రౌండప్: ఆ హీరోయిన్ కోసం కుర్ర హీరోల క్యూ! శీలంపై సంపూ మెసేజ్.. వార్తల్లో మెగాస్టార్, ఉపాసన


శీలం గురించి సంపూ మెసేజ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. 'శీలో రక్షతి రక్షితః' అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు తెల్లదొర (ఆంగ్లేయుడి)గా కనిపించి ఆసక్తి రేకెత్తించాడు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, పృథ్వీ, నాగ మహేష్, గెటప్ శ్రీను, రోహిణి, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్నారు. ఉపాసనకు మెగా ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు అన్నిచోట్లా సూపర్ ఫాలోయింగ్ ఉంది. సామాజిక విషయాలపై పూర్తి అవగాహనతో ఉండే ఆమె తన కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద పెడుతుంటారు. తాజాగా అల్లు అర్జున్‌కి కరోనా రావడంతో ఆయన త్వరగా కోలుకునేందుకు ఉపాసన ఫుడ్ డైట్‌తో కూడిన ఒక ప్యాక్ పంపారు. ఇది తెలిసి మెగా లోకం ఆమెపై ప్రశంసలు గుప్పిస్తోంది. ఉప్పెన బ్యూటీ కోసం కుర్ర హీరోల క్యూ.. 'ఉప్పెన' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టికి వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. తాజాగా నితిన్‌ సినిమా కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారని టాక్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కుర్ర హీరోలంతా తమ సినిమాల్లో కృతి శెట్టియే బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారట. అమితాబ్ బచ్చన్‌ ఆపన్న హస్తం కరోనా విలయతాండవంలో ఎంతోమంది సినీ తారలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌ కొవిడ్‌ బాధితులకు అండగా నిలిచేందుకు 2 కోట్లు రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కరోనా సంరక్షణా కేంద్రానికి ఈ విరాళం అందించారు. తమన్నాదీ అదే బాట గోపీచంద్- తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'సీటీమార్' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్. గత నెలలోనే ఈ సినిమాను థియేటర్స్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదావేసి ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం.


By May 10, 2021 at 08:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/may-10-movie-roundup-upasana-sampoornesh-babu-amitabh-bachchan-in-news/articleshow/82513764.cms

No comments