Breaking News

మరాాఠా రిజర్వేషన్: మహారాష్ట్ర సర్కార్‌కి షాకిచ్చిన సుప్రీంకోర్టు


మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 50 శాతానికి మించొద్దని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని రద్దు చేస్తూ బుధవారం కీలక తీర్పునిచ్చింది. మరాఠాలు ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి లేరని జస్టిస్ అశోక్ భూషణ్ తన తీర్పు ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల కోసం 50 శాతం పరిమితిని ఏ రాష్ట్రం కూడా అతిక్రమించడాని వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 13 శాతం కోటా కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రిజర్వేషన్‌ పరిమితిని 65శాతానికి పెంచింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్‌ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పరిమితి ఉల్లంఘన కిందకే వస్తుందని, అయితే మరాఠా రిజర్వేషన్ ఆధారంగా 2020 సెప్టెంబర్ 9 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇది వర్తించదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


By May 05, 2021 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-dismissd-maharashtra-law-granting-reservation-to-maratha-community/articleshow/82400852.cms

No comments