Breaking News

వండర్... ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చిన మహిళ


దేశానికి చెందిన 25 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. ఒకేసారి ఏకంగా 9మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే అనే మహిళ‌కు నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ఆమెను మొరాకోలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె ఒకేసారి 9మందిని ప్రసవించింది. వీరిలో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ఈ విషయాన్ని మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సిబీ తెలిపారు. తల్లీ, నవజాత శిశువులు అందరూ బాగానే ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే మొరాకో, మాలిలలో నిర్వహించిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రకారం సిస్సే కడుపులో ఏడుగురు శిశువులున్నారని వైద్యులు గుర్తించారు. కానీ సీజేరియన్ ఆపరేషన్ తర్వాత 9మంది శిశువులకు జన్మనివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బహుళ జననాల్లో పుట్టిన ఈ శిశువులకు తరుచూ వైద్య సమస్యలు తరచూ తలెత్తవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


By May 05, 2021 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/malian-woman-gives-birth-to-nine-babies-on-tuesday-two-more-than-doctors-detected/articleshow/82400000.cms

No comments