Breaking News

శ్మశానం వద్ద స్వాగత ఫ్లెక్సీలు.. బీజేపీ నేతల అత్యుత్సాహంపై నెటిజన్ల ఫైర్


కర్ణాటకలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి విమర్శల పాలైంది. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద అధికారులు ఉచితంగా ఏర్పాట్లు చేశారు. Also Read: దాని క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశంతో స్థానిక బీజేపీ నేతలు అత్యుత్సాహపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి, అంత్యక్రియలకు వచ్చేవారికి నీరు, కాఫీ, భోజనం ఉచితంగా ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం నెలమంగల బీజేపీ నేతలకు తెలియడంతో కార్యకర్తలకు క్లాస్ పీకి ఆ ఫ్లెక్సీని తొలగించమని ఆదేశించారు. దీనిపై బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. Also Read: అయితే అప్పటికే ఆ ఫ్లెక్సీలను కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయ్యాయి. బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహంతా ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు. ఫ్లెక్సీల్లో మోదీతో పాటు సీఎం యడియూరప్ప నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో ‘అసలు మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.


By May 05, 2021 at 01:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/flex-boards-at-giddenahalli-graveyard-bjp-faces-trouble/articleshow/82402120.cms

No comments