Breaking News

సినిమా రౌండప్: పవన్ కళ్యాణ్ కోసం హాట్ బ్యూటీ వెయిటింగ్.. అదునుచూసి అలా! హైలైట్ కాబోతున్న సునీల్


సునీల్ క్యారెక్టర్‌‌పై త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సునీల్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. సునీల్‌కు వచ్చిన క్రేజ్‌లో త్రివిక్రమ్ హస్తం చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాస్త డీలా పడిన సునీల్‌ని తిరిగి ట్రాక్ ఎక్కించేందుకు ట్రై చేస్తున్నారట త్రివిక్రమ్. మహేష్ బాబుతో చేయబోయే తన కొత్త సినిమాలో సునీల్ పాత్రను హైలైట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌తో బిగ్ బాస్ విన్నర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా నటించబోతున్నారని సమాచారం. ఆతృతగా ఉందంటున్న హాట్ బ్యూటీ ‘సాహో’లో 'బ్యాడ్‌ బాయ్‌' అంటూ స్పెషల్ సాంగ్‌లో ఊపేసిన జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌.. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించనుందట. అయితే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని, దర్శకుడు క్రిష్‌ ఫోన్‌ కోసం వెయిటింగ్ అంటోంది జాక్వలిన్‌. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా హీరోకే మొదటి ప్రాధాన్యత 'F2'తో నవ్వుల సునామీ సృష్టించిన అనిల్ రావిపూడి ఇప్పుడు F3 మూవీ రూపొందిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని, ఆయనకే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారని తెలుస్తోంది. అదును చూసి ఆర్జీవీ ఎంట్రీ లాక్ డౌన్ ప్రభావంతో వినోదం కోసం ప్రేక్షులంతా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకున్న రామ్ గోపాల్ వర్మ 'స్పార్క్' అనే ఓటీటీతో రంగంలోకి దిగారు. అయితే మొదటి 12 గంటల్లోనే 'స్పార్క్' ఓటీటీ 121986 సబ్ స్క్రైబెర్స్ పొంది రికార్డు క్రియేట్ చేసింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది ఓటీటీ వరల్డ్‌లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది.


By May 16, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/may-16-movie-roundup-pawan-kalyan-sunil-trivikram-in-news/articleshow/82674103.cms

No comments