Breaking News

ప్రభుదేవాను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు తీస్తూ షాకింగ్ కామెంట్స్


కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో నానా రచ్చ చేసి చెన్నైలో మకాం వేసిన సంచలన తార .. ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో అర్థంకాని పరిస్థితి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖులపై ఆమె చేస్తున్న విమర్శలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోలను టార్గెట్ చేసి సెన్సేషన్ సృష్టించిన ఆమె తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ ప్రభుదేవాపై కన్నేసింది. కండల వీరుడు పేరు తీస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. సల్మాన్ ఖాన్ సినిమా వ‌చ్చిందంటే చాలు బాలీవుడ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొనడం అనేది కామన్. ఆయన హీరోగా దర్శకత్వంలో తెర‌కెక్కిన 'రాధే' మూవీ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం ఓటీటీ వేదిక‌గా ఈ సినిమా విడుద‌లై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అయితే తాజాగా ఈ మూవీని ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి చేసిన దారుణమైన కామెంట్స్ బీ టౌన్ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. 'రాధే' సినిమా గురించి వన్‌ లైన్ రివ్యూ అంటూ మొదలుపెట్టి తన మాటలకు పదును పెట్టింది శ్రీ రెడ్డి. సినిమా చరిత్రలోనే ఇదో చెత్త సినిమా అని చెప్పిన ఆమె సల్మాన్ ఖాన్ గొప్ప నటుడు అని కితాబిచ్చింది. కానీ ప్రభుదేవా సినిమాను నాశనం చేశాడు. చెత్త డైరెక్షన్, వరస్ట్ స్టోరీ. ఇది ఒక డస్ట్ బిన్ ఛి ఛి అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి శ్రీ రెడ్డి ఇలా ప్రభుదేవాపై కామెంట్ చేయడం వెనుక మ్యాటర్ ఏంటనే చర్చలు మొదలయ్యాయి.


By May 14, 2021 at 10:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sri-reddy-shocking-comments-on-prabhu-devas-radhe-movie/articleshow/82625295.cms

No comments