Breaking News

నా తల్లికే బెడ్ దొరకడం లేదు... కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే


కర్ణాటకలో విలయతాండం చేస్తోంది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపరుస్తోంది. కరోనా రోగులతో బెడ్లన్నీ నిండిపోవడంతో ఆస్పత్రుల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకూ కూడా కరోనా సోకితే బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి తన పరిస్థితి వివరిస్తూ కంటతడి పెట్టుకోవడం సంచలనంగా మారింది. Also Read: సోమవారం ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి ఒక్కసారిగా కంటతడిపెడుతూ.. తన తల్లి కరోనా బారినపడ్డారని, పరిస్థితి విషమంగా ఉన్నా హుబ్బళ్ళి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఒక్క బెడ్ సమకూర్చుకోలేకపోతున్నానని రోదించారు. దీనిపై వెంటనే స్పందించిన సిద్దరామయ్య కిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని, చామరాజనగర్‌లో ఆక్సిజన్‌ లభించక 24మంది కరోనా బాధితులు మృతి చెందారని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కోవిడ్ బాధితులకు అవసరమైన సేవలు అందిస్తూ వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు.


By May 04, 2021 at 01:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kundagol-mla-shivalli-comments-on-karnataka-corona-situation/articleshow/82384316.cms

No comments