Breaking News

Vakeel Saab Intro Scene: పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్.. వాయించేశాడులే! ఈలలతో దద్దరిల్లిన థియేటర్స్


సాధారణంగానే సినిమాలో హీరో ఎంట్రీ సీన్‌కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అదీ స్టార్ హీరో సినిమా అయితే మరీనూ!. తమ అభిమాన హీరోను కథలోకి ఎలా ఎంటర్ చేయబోతున్నారని ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. తీరా వెండితెరపై కనిపించాక గోల పెట్టేస్తుంటారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఎంట్రీ సీన్ అంటే ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ రోజు (శుక్రవారం) విడుదలైన '' సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ విషయంలో అదే జరిగింది. పవర్ స్టార్ వెండితెరపై ప్రత్యక్షమైన ఆ క్షణంలో ఒక్కసారిగా అభిమానుల ఈలలు, గోలతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. వకీల్ సాబ్ సినిమా 15 నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ముందే చెప్పేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో.. దానికి ఏ మాత్రం తగ్గకుండా వకీల్ సాబ్ ఎంట్రీ ఇస్తారని ఆయన చెప్పారు. దిల్ రాజు చెప్పినట్లుగానే అదే జరిగింది. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌తో పవన్ ఎంటర్ అయ్యారు. ఎదురుగా ఉన్న గూండాలను చితకొట్టేశారు. మూడేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఆయన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ చూసి థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఈలలు, కేకలు పెట్టారు ఫ్యాన్స్. అన్ని థియేటర్స్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ వీరలెవెల్ అంతే! అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు పీకే ఫ్యాన్స్. ఈ సినిమాలో పవన్ యాక్షన్ అదిరిపోయిందని అంటున్నారు ఇప్పటికే సినిమా చూసేసిన ఆడియన్స్. డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్‌తో పాటు థమన్ బాణీలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయని చెబుతున్నారు. మొత్తానికి సినిమా రివ్యూలు బయటకు రాకముందే వస్తున్న ఈ టాక్ 'వకీల్ సాబ్'కి మంచి బూస్టింగ్ అవుతోంది.


By April 09, 2021 at 10:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vakeel-saab-pawan-kalyan-entry-seen-highligh-in-theatres/articleshow/81982010.cms

No comments