Breaking News

RGV: కరోనాతో బెడ్‌పై పవన్ కళ్యాణ్‌.. హే పీకే ఫ్యాన్స్ అది కోవిడ్ కాదు వకీల్ సాబ్ దెబ్బ!వర్మ షాకింగ్ కామెంట్స్


ఏది మాట్లాడినా వర్మకే చెల్లుతుంది. అనాల్సిందంతా అనేసి దానికి లాజిక్ చెప్పడం ఆయనకు మాత్రమే సొంతమైన లక్షణం. ఈ క్రమంలోనే మొదటి నుంచే కల్లోలంపై సెటైర్స్ వేస్తూ వార్తల్లో నిలుస్తున్న .. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా సోకిందని తెలిసి మరోసారి రంగంలోకి దూకారు. పీకే ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలేలా.. కాదు కాదు పవన్‌కి సపోర్ట్‌గా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. వర్మ పోస్ట్ చేసిన సందేశాలు చూస్తే ఇలాగే చెప్పాలి మరి. ఇంతకీ పవన్‌ ఫ్యాన్స్‌ని కెలికారా? లేక తాజా పరిస్థితి గురించి తెలిపారా? అనేది అర్థం కాకుండా ట్వీట్స్ చేసి నెట్టింట రచ్చ క్రియేట్ చేశారు ఆర్జీవీ. నిన్న (శుక్రవారం) పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని అఫీషియల్‌గా తెలుపుతూ ఆయన బెడ్‌పై పడుకొని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేశాయి జనసేన వర్గాలు. దీంతో ఈ ఫొటోనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. ''హే పీకే ఫ్యాన్స్ ఆ వైరస్‌ని పచ్చడి చేసి చంపేయండి. ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి యువర్ హానర్'' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతటితో ఆగక ''హే పీకే ఫ్యాన్స్.. చాలామంది వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్ నా కొడుకులు పవన్ కళ్యాణ్ ఇలా మంచాన పడటానికి కారణం కోవిడ్ కాదు, వకీల్ సాబ్ కలెక్షన్స్ అంటున్నారు. రండి, కదలండి.. ప్రాణాలకు తెగించి పీకే జేబులను నింపండి'' అంటూ మరింత రెచ్చగొట్టే సందేశం పోస్ట్ చేశారు వర్మ. ఆ వెంటనే.. పీకే బెడ్‌పై పడుకున్న ఫొటో ఫేక్ అని ఎవరు రుజువు చేస్తారో అతని ఫొటో పెట్టి రివార్డ్ కూడా ఇస్తా అంటూ వర్మ రివర్స్ గేర్ వేశారు. అంతేకాదండోయ్! ఏకంగా పవన్ ఫొటోని రాజమౌళికి ట్యాగ్ చేస్తూ దీనిపై అనుమానాలు ఎందుకొస్తున్నాయో మీ ఆర్ట్ డైరెక్టర్‌ని చెప్పమనండి అని మరో ట్వీట్ పెట్టారు. ఇక చివరగా.. ''ఫేక్ అని నేనట్లేదు..వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్లు అంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికే పీకే ఫ్యాన్‌గా ఆ ఛాలెంజ్ విసిరా'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ వదిలారు వర్మ. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట రచ్చరచ్చగా మారాయి. నెటిజన్లు ఎవరికి తోచినవిధంగా వారు కామెంట్స్ వదులుతున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కరోనాతో బాధపడుతుంటే వర్మ ఇలా పోస్టులు పెట్టడం మరోసారి జనాల్లో హాట్ టాపిక్ అయింది.


By April 17, 2021 at 09:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-shocking-comments-on-pawan-kalyans-corona-positive/articleshow/82112224.cms

No comments