Breaking News

Pawan Kalyan: వకీల్ సాబ్ మూవీపై మహేష్ బాబు రివ్యూ.. హార్ట్‌ టచ్‌ పర్ఫామెన్స్ అంటూనే పవన్‌పై కామెంట్


వెండితెరకు మూడేళ్ల విరామం ఇచ్చిన పవర్ స్టార్ ''తో గ్రాండ్ రీ- ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు హ్యాండిల్ చేస్తూనే సినిమా పూర్తిచేసిన ఆయన, ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రభంజనం సృష్టించారు. సిల్వర్ స్క్రీన్‌పై పవన్ యాక్టింగ్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్ చూసి క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. మరోవైపు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూసిన సినీ సెలబ్రిటీలు సైతం వెంటనే చూసేసి తమ తమ రివ్యూ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు 'వకీల్ సాబ్'పై ప్రశంసల వర్షం గుప్పించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్ అని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వకీల్ సాబ్ మూవీ చూసిన తనదైన శైలిలో స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ''పవన్ కళ్యాణ్ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. వకీల్‌సాబ్‌ సినిమాలో పవర్‌ ప్యాక్‌డ్‌ పర్ఫామెన్స్‌ కనబర్చారు. పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ‌. ప్రకాష్ ‌రాజ్‌ గారు బ్రిలియంట్‌. గర్ల్స్ నివేతా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల హార్ట్‌ టచ్‌ పర్ఫామెన్స్‌ చేశారు. థమన్‌ టాప్‌ రేంజ్‌ మ్యూజిక్‌ను అందించాడు. టీమ్‌ మొత్తానికి అభినందనలు'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మాహేష్ బాబు. మరోవైపు వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ మొదటిరోజే రూ.36.46 కోట్ల షేర్, రూ.52.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏకంగా రూ.32 కోట్ల షేర్, రూ.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి పవన్‌కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే ఆల్‌ టైమ్ రికార్డుగా నిలిచింది వకీల్ సాబ్ మూవీ.


By April 11, 2021 at 08:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-comments-on-pawan-kalyans-vakeel-saab-movie/articleshow/82012775.cms

No comments