Breaking News

మాస్క్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? చుప్ ఆపండ్రా..! సుల్తాన్ ప్రీ రిలీజ్‌లో రెచ్చిపోయిన రష్మిక, ఫ్యాన్స్‌కి క్లాస్


ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోలు దర్శకులు స్పీచ్‌లతో అదరగొడుతుంటారు. ఆ విషయంలో హీరోయిన్స్ కాస్త బెరుకుగానే ఉంటారు. పెద్దగా మాట్లాడరు.. అయితే రష్మిక మాత్రం తానో రేప్ పీస్ అన్నట్టుగా చేసింది. మైక్ అందుకుని ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టేయడమే కాకుండా.. వారికి క్లాస్ పీకుతూ కేవలం గ్లామర్‌తోనే కాదు మాటలతో గాలం వేయగలనని చెప్పకనే చెప్పింది. కార్తీ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సందడి చేసింది రష్మిక. ఆమె మాట్లాడుతూ.. ‘చాలారోజుల తరువాత మిమ్మల్ని (ఫ్యాన్స్) కలవడం సంతోషంగా ఉంది. ఇంతకీ కరోనా ఎలా ఉంది (నవ్వుతూ).. కరోనా బాగుందా?? మీరు ఎలా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారా?? నాకేం కనిపించడం లేదు.. మాస్క్‌లు పెట్టుకుంటున్నట్టుగా కనిపించడం లేదు.. మాస్క్‌లు ఎక్కడ పెట్టుకుంటున్నారు.. నాకేం కనిపించడం లేదే.. సర్లే అందరూ కేర్ ఫుల్‌గా ఉండండి.. బట్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి. నన్ను హీరో కార్తీ చెన్నైలో బాగా చూసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి బాగా చూస్కోండి. మన హైదరాబాద్ అని మంచి హైప్ ఇచ్చా.. బాగా చూస్కోండి. ఏప్రిల్ 2న సుల్తాన్ సినిమా రాబోతుంది. తమిళ్‌లో నా డెబ్యూ ఫిల్మ్ కాబట్టి.. కాస్త టెన్షన్‌గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది?? టీజర్, ట్రైలర్‌లు చూస్తుంటే.. ఏదైనా మాట్లాడండి అంటూ అభిమానుల్ని రెచ్చగొట్టేసింది రష్మిక. ఇక అభిమానులు సూర్య, కార్తీ అని గట్టిగా అరుస్తూ రష్మికను మాట్లాడకుండా చేశారు. దీంతో ఆమె కూడా సూర్య.. కార్తీ అని అరుస్తూ.. చుప్.. ఆపండెహే నన్ను మాట్లాడనీయండి.. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది.. ప్లీజ్ రా మాట్లాడనీయండ్రా అని మళ్లీ స్పీచ్ మొదలుపెట్టింది రష్మిక. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన వంశీ పైడిపల్లికి కంగ్రాట్స్ చెప్పింది రష్మిక. నాకు పార్టీ కావాలి.. ‘మహర్షి’ సినిమాకి నేషనల్ అవార్డ్ రావడంతో వంశీ అన్నా.. పార్టీ కావాలి నాకు అని అడిగింది రష్మిక. ఈ సినిమా హిట్ అయితే నా బర్త్ డే గిఫ్ట్ మీకు అదే అంటూ స్టేజ్‌పై ఓవర్‌గా రియాక్ట్‌ అవుతూ అత్యుత్సాహం చూపించింది రష్మిక.


By April 01, 2021 at 01:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-ultimate-mass-speech-at-sulthan-pre-release-event/articleshow/81826907.cms

No comments